https://oktelugu.com/

Vijayawada : విజయవాడ నడిబొడ్డున అరవై ఏళ్ల నాటి సొరంగం.. ఎందుకు నిర్మించారో తెలుసా?

విజయవాడ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది దుర్గమ్మ(Durga Temple) ఆలయం. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ దర్శనానికి ఏటా లక్షల మంది భక్తులు వెళ్తారు. విజయవాడ కృష్ణ నది తీరంలో అమ్మవారు కొలువై ఉన్నారు. కృష్ణా నది, దుర్మ కారణంగానే విజయవాడ గుర్తింపు పొందింది,

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 7, 2025 / 08:12 PM IST

    Oldest Tunnel In Vijayawada

    Follow us on

    Vijayawada :  విజయవాడ పట్టణం చాలా వరకు ఒక ద్వీపంలా ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ, నగరం చుట్టూ కాలువల్లో నిరంతరం పారే నీరు. పెద్ద పెద్ద భవనాలు, భవాని పురం, గొల్లపపూడీ, గాంధీనగర్, దుర్గానగర్‌ ఇలా అనేక ప్రముఖ కాలనీలు నగరంలో ఉన్నాయి. ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటే చిట్టినగర్‌ సొరంగం. విజయవాడ నగర నడిబొడ్డున.. ఇంద్రకీలాద్రి కొండకు కూతవేటు దూరంలోనే ఈ టన్నెల్‌ ఉంటుంది. నిత్యం వేలాది మంది ఈ సొరంగం గుండా ప్రయాణిస్తారు. కనకదుర్గ వారధి కట్టక ముందు హైదరాబాద్‌ వెళ్లాలంటే ఈ సొరంగ మార్గం ద్వారానే వెళ్లేవారు. దీని గురించి చాలా మందికి తెలియదు. ఈ సొరంగ మార్గం ఏర్పడకముందు గొల్లపూడి నుంచి గాంధీనగర్‌వైపు రావాలంటే భవానీ పురం బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. అందుకు బాగా సమయం కేటాయించాల్సి వచ్చేది. ఈ సొరంగం ఏర్పడ్డాక ప్రయాణ సమయంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ సొరంగం లేనప్పుడు చాలా మంది ఈ కొండపైకి ఎక్కి అవతలివైపు నగరంలోకి దిగేవారట.

    స్వాతంత్రం వచ్చాక..
    ఈ సొరంగాన్ని స్వాతంత్య్రం వచ్చాక దశాబ్దకాలంపాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి అప్పటి నగర కమిషనర్‌ అజిత్‌సింగ్‌, డాక్టర్‌ కేఎల్‌.రావు ఈ సొరంగం ఏర్పాటుకు ప్రతిపాదించారు. తర్వాత కొండను తవ్వి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. 1965, జనవరి 4న దీనిని ప్రారంభించారు. ఈ మార్గం ఏర్పాటు చేయడానికి వాళ్ల చాలా కృషి చేశారని స్థానికులు తెలిపారు. 2016 కృష్ణ పుష్కరాల సందర్భంగా అప్పటి సీఎం చంద్రబాబు ఈ సొరంగాన్ని ఆధునికీకరించారు. రంగురంగుల పెయింటింగ్‌, లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సొరంగం గుండా వెళ్లేవారికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ సొరంగం వెలవెలబోతోంది. ఎంతో చరిత్ర కలిగిన సొరంగం ప్రస్తుతం పాలకులు, అధికారుల నిర‍్లక్ష్యంతో అధ్వానంగా మారింది. మందుబాబులు, యాచకులకు అడ్డాగా మారింది.

    చినుకు పడితే వణుకే..
    ఇక ఈ సొరంగ మార్గం నుంచి నిత్యం ఆహ్లాదంగా ఉండే ప్రయాణం వర్షాలు పడితే మాత్రం భయానకంగా మారుతుంది. ఏ బండరాయి వచి‍్చ మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల వరుసగా కొండచరియలు విరిగి పడ్డాయి. పైనుంచి వచ్చే వరదనీరు కూడా ఇందులోకి చేరుతోంది. రక్షణ గోడ నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సొరంగ మార్గం వద్దకు బస్టాండ్‌ నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. లోకల్‌ ఆటోలు అందుబాటులో ఉంటాయి. బస్టాండ్‌ నుంచి గొల్లపూడి వెళ్లాలంటే ఈ సొరంగ మార్గం నుంచే వెళ్లాలి.