https://oktelugu.com/

Hero Ajith : రేసు పందెంలో ప్రమాదానికి గురైన తమిళ హీరో అజిత్ కారు..వైరల్ అవుతున్న వీడియో..ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే!

దుబాయ్ గ్రౌండ్ ఫ్రీ లో జరిగే రేస్ పందెంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అజిత్, ప్రాక్టీస్ చేస్తుండగా ఆ కారు గోడని ఢీ కొట్టింది. దీంతో ఆ కారు బొంగరం లాగా గింగిరాలు తిరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ ప్రమాదం ని చూసిన అభిమానులు వణికిపోయారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 7, 2025 / 08:51 PM IST

    Hero Ajith Car Accident

    Follow us on

    Hero Ajith : తమిళంలో సూపర్ స్టార్ గా పిలవబడే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు అజిత్(Thala Ajith). ఈయన సినిమా వస్తుందంటే చాలు, తమిళనాడు మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. అన్ని సజావుగా సాగి ఉంటే జనవరి 10 వ తారీఖున ఆయన హీరో గా నటించిన ‘విడాముయార్చి'(Vidaamuyaarchi) చిత్రం విడుదల అయ్యి ఉండేది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇదంతా పక్కన పెడితే అజిత్ ప్రొఫెషినల్ రేసర్ అనే విషయం అందరికీ తెలిసిందే. దుబాయ్ గ్రౌండ్ ఫ్రీ లో జరిగే రేస్ పందెంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అజిత్, ప్రాక్టీస్ చేస్తుండగా ఆ కారు గోడని ఢీ కొట్టింది. దీంతో ఆ కారు బొంగరం లాగా గింగిరాలు తిరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ ప్రమాదం ని చూసిన అభిమానులు వణికిపోయారు.

    మా అభిమాన హీరో కి ఏమైందో ఏమో అని కంగారు పడ్డారు. కానీ అదృష్టం ఏమిటంటే అజిత్ శరీరం పై చిన్న గీత కూడా పడలేదట. ఆయన సురక్షితంగా ఈ ప్రమాదం నుండి బయటపడ్డాడని, అభిమానులు ఎలాంటి కంగారుకి గురి కావాల్సిన అవసరం లేదని, మీ అభిమానం, ప్రేమ ఉన్నంత కాలం అజిత్ కి ఏమి అవ్వదనీ ధైర్యం చెప్పారు. ఇక పోతే ఈ నెల 11 , 12 తేదీలలో దుబాయి వేదికగా 24H కార్ రేస్ జరగనుంది. మరి అజిత్ ఇందులో గెలుస్తాడా లేదా అనేది చూడాలి. రేసింగ్ అంటే అజిత్ మామూలు పిచ్చి కాదు. సినిమా షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు రేసింగ్ కి వెళ్ళిపోతాడు. కొద్దినెలల క్రితమే ఆయన 234 కిలోమీటర్ల వేగంతో కారుని తోలడం, దానికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో అభిమానులు ఎంతలా కంగారు పడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    అంతే కాదు, షూటింగ్ సమయంలో అజిత్ రిస్కీ షాట్స్ కోసం ఎలాంటి దూప్స్ ని వాడేందుకు ఇష్టపడడు. ఈయన చేసే స్తంట్స్ చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ముఖ్యంగా అతనితో కలిసి పని చేసేవాళ్ళు మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్, మేము మీతో పాటు ఈ స్టంట్ లో పాల్గొనలేము అని బ్రతిమిలాడినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో ఆయన వళ్లు గగురుపొడిచే యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటాడు. ఇక అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘విడాముయార్చి’ తో పాటు ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత త్వరలోనే ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.