Nithya Menen: సినిమా హిట్ అయితే..క్రేజీ హీరోయిన్ గా చాలామంది చలామణి అవుతారు. అయితే సహజనటి అనే ఇమేజ్ ను మాత్రం జనరేషన్ కి ఒకరో ఇద్దరో మాత్రమే తెచ్చుకోగలరు. ఈ జనరేషన్ సహజ నటీమణుల్లో నిత్యా మీనన్ కూడా ఒకరు. నిత్యా మీనన్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ, ఆమె వ్యక్తిత్వం చాలా మంచిది అని ఆమెతో పని చేసిన వారు చెబుతుంటారు.

కాకపోతే.. కథల విషయంలో పాత్రల విషయంలో ఆమె వైఖరి సరిగా ఉండదు అని టాక్ ఉంది. మొత్తానికి భీమ్లా నాయక్ తో అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. ఇక నిత్యా మీనన్ పెళ్లి గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఆమె ప్రేమ కోసం ఓ దర్శకుడు తెగ ఉబలాట పడుతున్నాడట. నిత్యా మీనన్ క్యారెక్టర్ కి ఒక దర్శకుడు తెగ కనెక్ట్ అయిపోయాడట.
Also Read: మూడు రోజుల్లో రూ.100కోట్లు.. బాక్సాఫీస్ వద్ద భీమ్లానాయక్ ఊచకోత.
నిత్యా మీనన్ కి అతను పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. కానీ నిత్యా మీనన్ మాత్రం అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించిందట. అయినా నిత్యా మీనన్ ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఒక తమిళ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫలానా తెలుగు హీరోతో ఆమె సన్నిహితంగా ఉంటుందని అన్నారు.

ఈ లోపు ఓ మలయాళ సినిమా షూటింగ్ సమయంలోనే నిత్యా మీనన్ మంచితనానికి మరో దర్శకుడు ఫిదా అయిపోయాడని, పెళ్లికి కూడా ఈ ఇద్దరు రెడీ అయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమా తర్వాత వీరిద్దరి బంధం కూడా ప్లాప్ గా ముగిసిందట.
మొత్తానికి నిత్యా మీనన్ ప్రేమాయణం గురించి న్యూస్ సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా అనేక రకాలుగా న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మరోపక్క నిత్యా మీనన్ అభిమానులు మాత్రం ఆమెకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఓటీటీలోకి ‘రామారావు ఆన్ డ్యూటీ’