Cinema Viral: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సలార్ మూవీలో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుందనే వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఖిలాడీ మూవీ ప్రమోషన్‌లో ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. ఇవన్నీ గాసిప్స్ అని .. సలార్ మూవీలో తాను నటిస్తున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని కొట్టిపారేసింది. ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్‌లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. కర్ణాటకలో హిజాబ్ వివాదంపై సినీ నటుడు కమల హాసన్ స్పందించారు. ”కర్ణాటకలో చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయి. అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతోన్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలి. తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ ట్వీట్ చేశారు.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. ఏపీ థియేటర్లలో టికెట్ల ధర పెంచాలని ప్రభుత్వానికి కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం.. మల్టీప్లెక్స్ టికెట్ రేట్లలో పెద్దగా మార్పు లేదు. మున్సిపాలిటీలు, గ్రామ, నగరపంచాయతీల్లో టికెట్ రేట్లు పెంచొచ్చు. నాన్ AC థియేటర్లు ఎక్కడున్నా టికెట్ ధర రూ.30 ఉండాలి.

కాగా ఈ థియేటర్లలో గరిష్ఠంగా ఉన్న రూ.15 టికెట్‌ను రూ.70కి పెంచాలి. AC థియేటర్లలో కనీస టికెట్ రూ.40, గరిష్ఠంగా రూ.150 ఉండొచ్చు.