Keerthy Suresh
Keerthy Suresh: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్(Keerthy Suresh). తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఈమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె మొదటి సినిమా ‘నేను శైలజ’ లో చూసినప్పుడు, ఈ అమ్మాయి చాలా సైలెంట్ అనుకుంటా, నోటి నుండి మాట కూడా వచ్చేలా లేదు అని అనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ని అనుసరించిన తర్వాతే కీర్తి సురేష్ అంటే ఏంటో అందరికీ తెలిసొచ్చింది. అందరి అమ్మాయిలు లాగానే చాలా సరదాగా, ఫన్ గా ఉండే అమ్మాయి ఈమె. స్టార్ హీరోయిన్, నేషనల్ అవార్డు విన్నర్ అనే గర్వం ఈమెలో ఇసుమంత కూడా ఉండదు. ఆమె అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం చూస్తే ఒక సాధారణ అమ్మాయి లాగానే అనిపిస్తుంది. అందుకేనెమో ఆమెకు ఇంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
రీసెంట్ గానే కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో కీర్తి సురేష్ ఐస్ క్రీం కొనుగోలు చేయడానికి ఒక షాప్ కి వెళ్తుంది. ఐస్ క్రీం షాప్ ఓనర్ ఈమె చేతిలో ఐస్ క్రీం పెట్టడానికి చాలాసేపటి వరకు ఆటపట్టిస్తాడు. ఎట్టకేలకు ఐస్ క్రీం ని దక్కించుకున్న కీర్తి సురేష్, డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ ఓనర్ తనని ఎలా అయితే ఆట పట్టించాడో, కీర్తి సురేష్ కూడా అలాగే ఆట పట్టించింది. ఇక చివర్లో ఓనర్ కీర్తి సురేష్ చేతుల్లో నుండి డబ్బులు లాక్కుంటాడు. ఈ వీడియో సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయ్యింది. కీర్తి సురేష్ క్యూట్ వేషాలకు అభిమానులు మురిసిపోతున్నారు. ఆ వీడియో ని మీరు కూడా ఈ ఆర్టికల్ చివర్లో చూసేయండి.
ఇకపోతే కీర్తి సురేష్ మన తెలుగు ఆడియన్స్ కి చివరగా ‘భోళా శంకర్’ అనే చిత్రం ద్వారా కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు లో మరో సినిమా చేయలేదు కానీ, హిందీ లో ‘బేబీ జాన్’ అనే చిత్రం చేసింది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి’ చిత్రానికి ఇది రీమేక్. తమిళం లో సమంత పోషించిన క్యారక్టర్ ని హిందీలో కీర్తి సురేష్ పోషించింది. అయితే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. పెళ్లి తర్వాత విడుదలైన మొట్టమొదటి సినిమా ఇది. ప్రస్తుతం ఆమె నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది, అదే విధంగా తమిళం లో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం అవి చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి.