https://oktelugu.com/

Nithin : డైరెక్టర్,నేను నిన్న రాత్రి కామించుకోబోయాము అంటూ హీరో నితిన్ బోల్డ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

Nithin : మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత హీరో నితిన్(Hero Nithin) కాస్త గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం 'రాబిన్ హుడ్'(Robin Hood Movie).

Written By:
  • Vicky
  • , Updated On : March 12, 2025 / 12:34 PM IST
    Nithin

    Nithin

    Follow us on

    Nithin : మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత హీరో నితిన్(Hero Nithin) కాస్త గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie). గతంలో తనతో భీష్మ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల మరోసారి నితిన్ తో కలిసి చేసిన చిత్రమిది. శ్రీలీల(Heroine Srileela) హీరోయిన్ గా నటించగా, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం లో నితిన్, శ్రీలీల, వెన్నెల కిషోర్ మరియు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ట్రాక్ హైలైట్ గా వచ్చిందని, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ ప్రెస్ మీట్ లో హీరో నితిన్ తో పాటు, డైరెక్టర్ వెంకీ, హీరోయిన్ శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ మరియు నిర్మాత రవి శంకర్ పాల్గొన్నారు.

    Also Read : పాపం నితిన్ ‘రాబిన్ హుడ్’  పరిస్థితి ఇలా అయ్యిందేంటి..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఇంతేనా!

    ఈ సందర్భంగా నితిన్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘నిన్న రాత్రి నేను, డైరెక్టర్ వెంకీ ఈ చిత్రాన్ని చూసాము. చూసిన తర్వాత కాస్త ప్రేమించుకున్నాము, ఆ తర్వాత కౌగలించుకున్నాము, ఇక చివరికి కామించుకోబోయే పరిస్థితి రావడంతో మధ్యలో ఆపేసాము. సినిమా అంత అద్భుతంగా వచ్చింది. కామెడీ పొట్ట చెక్కలయ్యేలా వర్కౌట్ అయ్యింది, అదే సమయంలో ఇతర ఎమోషన్స్ ని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తూ చాలా అద్భుతంగా ఈ సినిమా స్క్రిప్ట్ ని రాసాడు మన వెంకీ. ఈ సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ గా ఉండబోతుంది. ఇక శ్రీలీల తో ఇది నా రెండవ సినిమా, గతం లో మేము చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో మా ఇద్దరిపై ఫ్లాప్ జోడి అనే పేరు పోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను హీరో, హీరోయిన్ శ్రీలీల. కానీ ఇందులో మరో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది రాజేంద్ర ప్రసాద్ గారే. మా కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుంది. ఇంతటి ఆర్గానిక్ కామెడీ ఉన్న సినిమాని ఈ మధ్య కాలం లో మీరెప్పుడు చూసి ఉండరు. ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ని జనాలు చూసి ఎన్ని రోజులైందో. అలాంటి కామెడీ ని కోరుకునే ఆడియన్స్ మా సినిమాని రిపీట్ గా థియేటర్స్ కి వచ్చి చూస్తారు. ఆ రేంజ్ సత్తా ఉన్న చిత్రమిది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

    Also Read : రవితేజ వదులుకున్న ఈ సినిమా ఆ యంగ్ హీరో కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారిందా..?