https://oktelugu.com/

Nithin : రవితేజ వదులుకున్న ఈ సినిమా ఆ యంగ్ హీరో కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారిందా..?

రవితేజ లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా మంది కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలాగే కొంత మంది నిర్మాతలకు కూడా లైఫ్ ఇచ్చాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 1, 2024 / 08:16 AM IST
    Follow us on

    Nithin : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి చాలావరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు…ఈయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాడు. ఇక ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి అక్కడే ఆగిపోకుండా హీరో అవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు. ఇక అందులో భాగం గానే ఈరోజు వరకు కూడా ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక స్టార్ హీరోల పక్కన చిన్న చిన్న క్యారెక్టర్ లను కూడా పోషించాడు. అయిన కూడా ఆయన ఎప్పుడూ సిగ్గు పడలేదు. ఇక తన పట్టుదలను వదలకుండా ముందుకు సాగడం వల్లే ఆయన ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నాడని చాలా గర్వంగా చెప్పాలి… నిజంగా మనం ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకుంటే తప్పకుండా చేయగలుగుతాం అని చెప్పడానికి రవితేజ ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు… చాలామంది యంగ్ డైరెక్టర్లకి మొదటి అవకాశం ఇచ్చిన ఘనత కూడా రవితేజ కే దక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొన్ని సినిమాలని వదిలేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అది ఏ సినిమా అంటే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన ‘ఇష్క్ ‘…ఈ సినిమా ని మొదట దర్శకుడు రవితేజ తో చేయాలనుకున్నాడట.. నిజానికి రవితేజలో ఒక కొత్త యాంగిల్ ని చూపించాలనే ఉద్దేశ్యంతో విక్రమ్ కే కుమార్ రవితేజ ను ఉద్దేశించి ఈ సినిమా కథని రాసుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల రవితేజ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే అప్పటివరకు రవితేజ చాలా కమర్షియల్ సినిమాలను చేస్తూ మాస్ హీరోగా ఎదిగాడు.

    ఇక ఈ సినిమా ఫ్యామిలీ సినిమా అలాగే ఈ కథ ఆయన ఇమేజ్ కి సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. ఇక దాంతో నితిన్ హీరోగా ఈ సినిమాని చేసి ఒక సూపర్ సక్సెస్ ను అందుకున్నాడనే చెప్పాలి… నిజానికి ఈ సినిమాకి ముందు నితిన్ కి వరుసగా 13 ప్లాప్ లు ఉన్నాయి. అయినప్పటికీ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాకుండా తనను విక్రమ్ కే కుమార్ ఫ్లాపుల పురంపర నుంచి తప్పించాడనే చెప్పాలి.

    ఇక మొత్తానికైతే అప్పటినుంచి నితిన్ కథల ఎంపికలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అంతకుముందు ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ వచ్చిన ఈయన ఇప్పుడు మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందువల్ల నితిన్ కి ఈ మధ్య మంచి సక్సెస్ లు దక్కుతున్నాయి…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని రవితేజ చేసి ఉంటే ఎలా ఉండేది అనే విషయం మీద ఆయన అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.

    అందులో కొందరు ఈ సినిమా రవితేజ కి చాలా కొత్తగా ఉండేది అని అంటుంటే, మరి కొంత మంది మాత్రం ఈ సినిమా రవితేజ చేస్తే ఫ్లాప్ అయి ఉండేదని వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే రవితేజ వదిలేసుకున్న ఈ సినిమా నితిన్ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇష్క్ సినిమా కనక నితిన్ కి పడకపోయి ఉంటే నితిన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సి వచ్చేది…