YSR Congress party
YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీకి ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. దాని నుంచి గట్టెక్కేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. అయితే ఇంతలో ముఖ్య నియోజకవర్గాల విషయంలో చేర్పులు మార్పులకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా సైలెంట్ లోకి వెళ్లిన నాయకుల స్థానంలో కొత్త వారిని నియమించాలని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సమర్థవంతమైన నేతలకంటే.. పార్టీని ముందుకు నడిపించగల నాయకులకు బాధ్యతలు అప్పగించడానికి సిద్ధపడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు సమీపిస్తోంది. క్షేత్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంతవరకు అలెర్ట్ కావడం లేదు.
Also Read : ప్రమాదంలో వైయస్సార్ కాంగ్రెస్.. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అదే!
* కీలక నేతలు మౌనవ్రతం
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. కూటమి( allians ) పార్టీల్లో చేరిన వారు ఉన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న వారు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక నియోజకవర్గాల్లో మాత్రం.. ఎవ్వరూ కనిపించడం లేదు. కేసుల భయంతో కొందరు.. అరెస్టుల భయంతో ఇంకొందరు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్టీని నడిపించడం అంత ఈజీ కాదని.. గత ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వారు నాలుగు రాళ్లు వెనకేసుకున్నారని.. తమ వద్ద అంత ఆర్థిక పరిస్థితి లేదని కొంతమంది నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో పార్టీ బాధ్యతలతో పాటు ఆ నేతను ఆర్థికంగా ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నట్లు సమాచారం.
* క్రియాశీలకం చేయడానికి
ప్రస్తుతం రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నిలబడాలి. అలా జరగాలంటే నియోజకవర్గాల్లో బాధ్యులు యాక్టివ్ గా పని చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల బాధ్యులతో పాటు మండలాల కన్వీనర్లకు జీతాలు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పార్టీలోనే ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడిన ఇన్చార్జిలకు కొంత మొత్తం జీతం గా చెల్లించాలని.. మండలాల కన్వీనర్లకు సైతం జీతాలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలా పెడితే కానీ నేతలు పని చేయరని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
* నేడు విద్యార్థుల కోసం పోరుబాట..
ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అందుకే జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉద్యమ బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కానీ సగానికి సగం నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి కారణం నియోజకవర్గ ఇన్చార్జిలు యాక్టివ్ గా లేకపోవడమే. అందుకే జీతాల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు మండలాల కన్వీనర్లకు జీతాలు ఫిక్స్ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.
Also Read : వైఎస్సార్ కాంగ్రెస్ లోకి కీలక నేత రీ ఎంట్రీ!