Rajendra Prasad
Rajendra Prasad : నితిన్(Nithin), వెంకీ కుడుముల(Venky Kudumula) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం ఈ నెల 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాము. నితిన్ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడు అనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థం అందరికీ అర్థం అవుతుంది. ముఖ్యంగా మొన్న విడుదల చేసిన ‘సర్ప్రైజ్’ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ యంగ్ హీరోయిన్ కేతిక శర్మ ఈ పాటలో ఆడిపాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇందులో కేతిక శర్మ హాట్ అందాలను చూసి కుర్రకారులు మెంటలెక్కిపోయారు. ఈమధ్య కాలంలో ఇంత హాట్ సాంగ్ ని చూడలేదంటూ కామెంట్స్ చేసారు. ఇది ఇలా ఉండగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ ఆయాయ్యి.
ఆయన మాట్లాడుతూ ‘వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను, ఈ ఈవెంట్ లో ఎక్కడా కూడా నా ఫోటో కనిపించడం లేదు’ అని అనగా, అప్పుడు శ్రీలీల(Heroine Srileela) వెంటనే మైక్ అందుకొని ‘మిమ్మల్ని చూడాలంటే టికెట్ కొనుక్కొని థియేటర్ లోపల చూడాలి’ అని అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ‘అబ్బో..ఈ అమ్మాయి మా ఊర్లో అమ్మాయి లాగా మాట్లాడుతుంది. చాలా తెలివైన పిల్ల’ అంటూ కామెంట్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన సినిమా గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు నా పాత రోజులు, అనగా నేను హీరోగా చేసిన రోజులు గుర్తుకొచ్చాయి. నా కెరీర్ లో ఎన్నో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. అందులో ఈ సినిమా కచ్చితంగా నిలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అయిపోయాయి. ఈ సినిమాలో అలాంటి వాటికి ఆస్కారం లేదు. చాలా క్లీన్ గా, ఆర్గానిక్ కామెడీ ఇందులో ఉంటుంది. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. నేను చెప్పినట్టు మీకు అనిపించకపోతే, నా పేరు ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రాజేంద్ర ప్రసాద్. ఇన్నేళ్ల కెరీర్ లో రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా గురించి ఈ రేంజ్ లో మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు. అది కూడా తన పేరుని మార్చుకుంటాను అనే రేంజ్ కామెంట్స్ గతంలో ఆయన ఎప్పుడూ చేయలేదు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ ఈ రేంజ్ లో మాట్లాడాడు అంటే, కచ్చితంగా సినిమా అంత అద్భుతంగా వచ్చిందా?, లేకపోతే ఆయన అతిశయంతో మాట్లాడాడా అనేది తెలియాలంటే ఈ నెల 28 వరకు ఆగాల్సిందే.
Also Read : రాబిన్ హుడ్ టీజర్ రివ్యూ: సరికొత్త రోల్ లో మెస్మరైజ్ చేసిన నితిన్… ఈ దొంగోడి లాజిక్ కేక!