Homeఎంటర్టైన్మెంట్Nithiin new movie: చివరికి నితిన్ బూతు సినిమాలో నటించబోతున్నాడా..? హీరోయిన్ ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Nithiin new movie: చివరికి నితిన్ బూతు సినిమాలో నటించబోతున్నాడా..? హీరోయిన్ ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Nithiin new movie: స్టార్ హీరో రేంజ్ కి వెళ్లగల సత్తా అన్ని విధాలుగా ఉన్నప్పటికీ, సరైన ప్లానింగ్ లేక , కనీస స్థాయి మార్కెట్ ని కూడా కోల్పోయిన హీరోలలో ఒకరు నితిన్. ఇతను మన టాలీవుడ్ లో పని చెయ్యని టాప్ డైరెక్టర్ అంటూ ఎవరు మిగల్లేదు. రాజమౌళి , వీవీ వినాయక్ , పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ , ఇలా ఒక్కరా ఇద్దరా?, దాదాపుగా అందరి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసాడు, అయినప్పటికీ స్టార్ కాలేకపోయాడు. అందుకు కారణం ఒక హిట్ సినిమా తీస్తే , వరుసగా నాలుగైదు డిజాస్టర్ సినిమాలు చేయడం వల్లే. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఈయన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. కరోనా వచ్చిన కొత్తల్లో విడుదలైన ‘భీష్మ’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.

ఈ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే లాక్ డౌన్ ని విధించారు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ ఆరు సినిమాలు విడుదల చేస్తే, ఈ ఆరు కూడా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ అవుతూ , ఆయనకు ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని నాశనం అయ్యేలా చేసింది. దీంతో ఇప్పుడు నితిన్ తో సినిమాలు చేసేవాళ్ళు లేరు. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేం ‘ఎల్లమ్మ’ చిత్రం లో ముందుగా నితిన్ ని హీరో గా తీసుకున్నాడు. కానీ నితిన్ మార్కెట్ పూర్తిగా చెడిపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి నితిన్ ని తప్పించి , దేవి శ్రీ ప్రసాద్ ని హీరో గా పెట్టుకున్నాడు. అదే విధంగా రీసెంట్ గా నితిన్ విక్రమ్ కె కుమార్ తో ఒప్పుకున్న సినిమా కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ కి షిఫ్ట్ అయ్యింది. కచ్చితంగా ఇది నితిన్ కి పెద్ద అవమానమే , అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే ప్రాజెక్ట్ తో నితిన్ మన ముందుకు రాబోతున్నాడు. ‘సెక్స్ ఎడ్యుకేషన్’ కాన్సెప్ట్ మీద ఇప్పటికే ఓటీటీ లో ఒక వెబ్ సిరీస్ విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. నితిన్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద తీయబోయే సినిమాలో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించబోతుంది మరెవరో కాదు , ‘కాంతారా 2’ ఫేమ్ రుక్మిణి వాసంత్ అట. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు , మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు , నిర్మాతగా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేదానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version