Sujeeth silent on OG 2: లోకల్ మీడియా నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ గురించే చర్చ. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి త్వరలోనే ‘ఓజీ 2’ సెట్స్ మీదకు వెళ్లనుంది , సుజిత్ ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ ఎప్పటి నుండి మొదలు అవ్వబోతుంది అనేది చెప్తాము అంటూ ఒక ట్వీట్ పడింది అంతే. ఇక సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆ ఒక్క ట్వీట్ కి దాదాపుగా 1 కోటి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. వారణాసి , డ్రాగన్ వంటి పాన్ వరల్డ్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు, అలాంటిది ‘ఓజీ 2’ కి వచ్చిందంటే , ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది. ఓజీ బ్రాండ్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ ఏంటో కూడా మరోసారి అందరికీ తెలిసొచ్చింది.
అయితే ఈ ట్వీట్ వేసి దాదాపుగా నాలుగు రోజులైంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన తమన్ ఈ ట్వీట్ కి రెస్పాన్స్ ఇచ్చాడు , అదే విధంగా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్ కూడా రెస్పాన్స్ ఇచ్చాడు. కానీ డైరెక్టర్ సుజిత్ నుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనిపై సోషల్ మీడియా లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ షూటింగ్ కి సిద్ధంగా ఉన్నాడని , ఈ ఏడాది నవంబర్ నుండి ఆయన ఈ చిత్రానికి కాల్ షీట్స్ ఇచ్చాడని , కానీ సుజిత్ ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే సుజిత్ తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ అని ఇప్పటికే ప్రకటించేశాడు. నేచురల్ స్టార్ నాని ఇందులో హీరో.
ఈ సినిమాకు నాని వచ్చే నెల నుండి డేట్స్ కేటాయించాడట. షూటింగ్ అత్యధిక శాతం లండన్ మరియు ఇతర విదేశీ లొకేషన్స్ లో జరగనుంది. హైదరాబాద్ లో కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే ఉంటుంది అట. అయితే పవన్ కళ్యాణ్ నుండి అకస్మాత్తుగా కాల్ రావడం తో సుజిత్ ఇప్పుడు ఇరకాటం లో పడ్డాడని , ముందు ఏ చిత్రాన్ని మొదలు పెట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని , ఇండియా కి తిరిగిన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపాక, ముందు ఏ సినిమా మొదలు అవుతుందో క్లారిటీ వస్తుందని, అందుకే సుజిత్ సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు ‘ఓజీ 2’ పై సుజిత్ మౌనం తప్పేలా లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
