https://oktelugu.com/

నిహారిక పెళ్లికి మెగా కానుకల విలువ 5 కోట్లు !

నిహారిక-చైతన్యల వివాహం నిన్న రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికలో ఘనంగా జరిగింది. కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల క్రితమే ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలలో పాల్గొని.. పెళ్లిలో సందడి చేశారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా హీరోలందరూ ఖరీదైన ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతూ.. నెటిజన్లను కనువిందు చేశారు. అయితే మొత్తం మెగా ఫ్యామిలీల నుంచి నీహారికకు పెళ్లి సందర్భంగా […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 11:17 AM IST
    Follow us on


    నిహారిక-చైతన్యల వివాహం నిన్న రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికలో ఘనంగా జరిగింది. కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల క్రితమే ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలలో పాల్గొని.. పెళ్లిలో సందడి చేశారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా హీరోలందరూ ఖరీదైన ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతూ.. నెటిజన్లను కనువిందు చేశారు. అయితే మొత్తం మెగా ఫ్యామిలీల నుంచి నీహారికకు పెళ్లి సందర్భంగా వచ్చిన కానుకలు కచ్చితంగా అయిదు కోట్ల మేరకు వుంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్, పవర్ స్టార్ నుండి నిహారికకు విలువైన నగల రూపంలో గిప్ట్స్ అందాయని.. అలాగే వరుణ్ తేజ్ చెల్లికి కోటి విలువ చేసే ఒక ప్లాట్ ను బహుమానంగా ఇచ్చాడని తెలుస్తోంది.

    Also Read: కాంట్రవర్సీ ట్వీట్ తో మహేష్, బన్నీ ఫ్యాన్స్ దగ్గర బుక్కైన సమంత

    చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న అతిపెద్ద వేడుక కావడంతో అందరూ కలిసి ఈ పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక పెళ్లికూతురు నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి తన స్థాయికి తగ్గట్టుగా కూతురు నిహారికకు ఒక వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ వజ్రాల హారం ధర ఏకంగా రెండు కోట్ల రూపాయలు అట. మొత్తానికి మెగా కుటుంబంలో పిల్లలందరినీ సమానంగా ఆదరించే చిరంజీవి, తనను స్వయంగా డాడీ అని పిలిచే నిహారికకు విలువైన గిఫ్ట్ ఇచ్చి.. ఆమె పట్ల తన ప్రేమను తెలియజేశాడు.

    Also Read: బిగ్ బాస్-4 విజేత ఆ ఇద్దర్లోనే..!

    ఇక గత కొన్ని రోజులుగా పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నిహారిక పెళ్లికి దీక్షకు బ్రేక్ ఇచ్చి మరీ ఉదయ్ పూర్ కు చేరుకుని.. పెళ్లి లో ఫుల్ జోష్ పెంచారు. అయితే పవన్ తన కొడుకు అకీరాతో కలిసి ఈ వేడుకకు హాజరు కావడం, పవన్ కంటే.. అకీరా ఫోటోలే ఎక్కువగా వైరల్ కావడం విశేషం. పవన్ మాజీ భార్య అకీరా తల్లి రేణూ దేశాయ్ ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా పవన్ రాకతో పెళ్లి వేడుక మరింత సందడిగా మారిపోయింది. నిహారికకు బాబాయ్ పవన్ కూడా ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్