https://oktelugu.com/

ఏమ్మా రేవతి.. అధికారం ‘చేతి’లో ఉంటే లాగిపెట్టి కొట్టొచ్చా?

అధికారం బెల్లం లాంటిది. బెల్లం చుట్టూ ఈగలు మసురుకున్నట్టే.. అధికారం చుట్టూ రాజకీయ నాయకులు మసురుకుంటారు. ఆ బెల్లం కరిగిపోగానే మళ్లీ జోరో అయిపోతారు. కానీ ఉన్నన్ని రోజు తమ పేరు దర్పం, పరపతి వినియోగించుకుంటారు. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చని.. తమను ఎదురిస్తే వారికి చుక్కలు చూపిస్తుంటారు. Also Read: ఏలూరులో మరణమృదంగం.. మరో ఇద్దరు మృతి.. కారణమేంటి? తాజాగా ఏపీలోనూ అలాంటి అధికార తలెక్కిన ఓ ప్రజా ప్రతినిధి తాజాగా అందరూ కట్టే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2020 / 10:59 AM IST
    Follow us on

    అధికారం బెల్లం లాంటిది. బెల్లం చుట్టూ ఈగలు మసురుకున్నట్టే.. అధికారం చుట్టూ రాజకీయ నాయకులు మసురుకుంటారు. ఆ బెల్లం కరిగిపోగానే మళ్లీ జోరో అయిపోతారు. కానీ ఉన్నన్ని రోజు తమ పేరు దర్పం, పరపతి వినియోగించుకుంటారు. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చని.. తమను ఎదురిస్తే వారికి చుక్కలు చూపిస్తుంటారు.

    Also Read: ఏలూరులో మరణమృదంగం.. మరో ఇద్దరు మృతి.. కారణమేంటి?

    తాజాగా ఏపీలోనూ అలాంటి అధికార తలెక్కిన ఓ ప్రజా ప్రతినిధి తాజాగా అందరూ కట్టే టోల్ ఫీజును తానెందుకు కట్టాలని.. అడిగిన టోల్ గేట్ సిబ్బంది చెంప పగులగొట్టింది. అధికార వైసీపీ నామినేట్ చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు కావడం.. పెద్దలతో వ్యవహారం కావడంతో ఆమె వీరంగానికి మౌనంగా చూస్తుండిపోయారు సిబ్బంది. ఇక ఆ మహిళా ప్రజాప్రతినిధియే కాదు.. ఆమె సిబ్బంది కూడా టోల్ గేట్ వద్ద అడ్డంగా పెట్టిన బారీకేడ్లను తొలగించి మరీ టోల్ ఫీజు కట్టకుండా పోయిన వైనం తాజాగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

    ఏపీలో తాజాగా టోల్​గేట్ సిబ్బందిపై వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ చేయిచేసుకుంది. రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద హంగామా చేశారు.ఆ వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం పరువుపోయింది. ఎంత ఒక కార్పొరేషన్ చైర్మన్ అయితే మాత్రం అంతలా రెచ్చిపోవాలని అని పలువురు విమర్శిస్తున్నారు.

    Also Read: హస్తినకు కేసీఆర్.. ప్రధానిని కలుస్తారా?

    రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి తాజాగా టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బంది పై చేయిచేసుకున్నారు. తననే టోల్ చెల్లించాలంటారా అని సిబ్బందిపై పరుష పదజాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు. అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు.

    తననే ఆపుతావా అంటూ కోపంతో ఊగిపోయారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసువేసి విజయవాడ వైపు వెళ్లారు. టోల్ గేట్ వద్ద ఆమె చేసిన వీరంగం వీడియోలు వైరల్ కావడంతో ఇప్పుడు ప్రభుత్వం పరువు పోయినట్టైంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్