Homeఎంటర్టైన్మెంట్హనీమూన్ కోసం 'నిహారిక' జంట.. !

హనీమూన్ కోసం ‘నిహారిక’ జంట.. !

మెగా నట వారసురాలు నిహారిక హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళిందని తెలుస్తోంది. అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని నిహారిక ఏరి కోరి భర్తతో మాల్దీవులకు వెళ్లిందట. నిహారిక, చైతన్య పెళ్లి ఉదయపూర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ఈ జంట గుళ్లు చుట్టూ తిరిగి మొత్తానికి బాగానే హడావుడి చేశారు. ఇక ఎలాగూ పెళ్లి హడావుడి ముగిసింది కాబట్టి.. ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉంది ఈ జంట. ముందుగా హనీమూన్ కి […]

Niharika Konidela and Chaitanya
మెగా నట వారసురాలు నిహారిక హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళిందని తెలుస్తోంది. అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని నిహారిక ఏరి కోరి భర్తతో మాల్దీవులకు వెళ్లిందట. నిహారిక, చైతన్య పెళ్లి ఉదయపూర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత ఈ జంట గుళ్లు చుట్టూ తిరిగి మొత్తానికి బాగానే హడావుడి చేశారు. ఇక ఎలాగూ పెళ్లి హడావుడి ముగిసింది కాబట్టి.. ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉంది ఈ జంట. ముందుగా హనీమూన్ కి పారిస్ వెళ్లాలని అనుకున్నప్పటికీ.. నిహారిక మాత్రం మాల్దీవులకు వెళ్లాలని పట్టు బట్టిందట.

Also Read: బిగ్ బాస్ తో రహస్య ఒప్పందం వల్లే మోనాల్ కి ఛాన్స్ !

దాంతో ఈ జంట మాల్దీవులకు వెళ్లారట. మొన్న కాజల్, గౌతమ్ హనీమూన్ ట్రిప్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవ్వటం చూశాం. వాళ్లిద్దరూ మాల్దీవులకు వెళ్లి అక్కడి అందమైన లోకేషన్స్ లో చక్కగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇప్పుడు నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా అందమైన అనుభూతి కోసం మాల్దీవుల్లోకి వెళ్లారు. అన్నట్టు నిహారిక భర్త కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ గా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.

Also Read: టీజర్ తో తెగ నవ్వించిన ‘జాతి రత్నం’ !

కళ్యాణ్ దేవ్ “విజేత” అనే సినిమాలో నటించి.. త్వరలో “సూపర్ మచ్చి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్యాణ్ దేవ్ కి మెగా సపోర్ట్ బాగా ఉంది. సో, నాగబాబు అల్లుడు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తే మెగా సపోర్ట్ ఎలాగు ఉంటుంది. దీనికి తోడూ చైతన్య కూడా మంచి అందగాడు. మరి చూడాలి హీరోగా అతను ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది. ఇక పెళ్లి తర్వాత నిహారిక మాత్రం సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొందట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper