India-Maldives Ties: బలమైన రాజు ఉంటే రాజ్యం కూడా బలంగానే ఉంటుంది. కాకపోతే ఆ బలాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రయోగించాలో రాజుకు తెలిసి ఉండాలి. అప్పుడే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మిగతా రాజ్యాలతో పోల్చి చూస్తే అత్యంత సంపన్నవంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే ప్రణాళికను భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నారు. తల ఎగిరేసి.. ఇంకా ఏదో చేద్దాం అనుకున్న దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు.. కాదు కాదు కాళ్ళ కిందికి తెచ్చుకుంటున్నారు.
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం లక్షద్వీప్ గురించి నరేంద్ర మోడీ గొప్పగా చెప్పారని మాల్దీవుల ప్రభుత్వం అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసింది. భారత దేశంలో పర్యాటకం అత్యంత అద్వానంగా ఉంటుందని.. సముద్ర తీర ప్రాంతాలను సంరక్షించుకోలేదని.. అందువల్లే అక్కడికి పర్యాటకులు ఎక్కువగా రారని పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యానించింది. అంతేకాదు ఆ వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నెత్తి మాసిన చైనాతో అంటకాగింది. అయితే చైనా తో స్నేహం ఎంత ప్రమాదమో.. భారతదేశంలో విరోధం ఎంత ఇబ్బందికరమో మాల్దీవులకు తెలిసి వచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి సిద్ధమైంది. వాస్తవానికి చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది కాబట్టి తమకు సహకరిస్తుందని మాల్దీవుల ప్రభుత్వం భావించింది. కానీ అది అంత సులభం కాదని.. తన అవసరాల కోసం మాత్రమే చైనా తమను వాడుకుందని మాల్దీవులకు అర్థమైంది. ఈ లోగానే మాల్దీవుల నుంచి భారత్ తన సైన్యాన్ని వెనక్కి రప్పించింది. ఎప్పుడైతే భారతదేశం మీద మాల్దీవుల ప్రభుత్వం అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిందో.. అప్పటినుంచి మన దేశం నుంచి పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లడం మానేశారు. దీంతో పర్యాటకపరంగా మాల్దీవులు తీవ్రంగా నష్టపోయింది. హోటళ్లు బోసిపోయాయి. వ్యాపారం లేక ఇతర సంస్థలు బోర్డు తిప్పేశాయి. దీంతో మాల్దీవులు ఒక్కసారిగా నేల చూపులు చూడడం మొదలుపెట్టింది.
Also Read: నెహ్రూ తర్వాత వరుసగా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా మోడీ
చైనాతో స్నేహం ప్రమాదకరమని.. భారతదేశాన్ని దూరం పెట్టడం తెలివి తక్కువ నిర్ణయం అని యి మాల్దీవులకు అర్థమైంది. ఆలస్యంగా నైనా గుణపాఠం నేర్చుకున్న ఆ ప్రభుత్వం ఒక్కసారిగా మోడీ శరణుజొచ్చింది. అంతేకాదు మా దేశాన్ని కాపాడాలి అంటూ కాళ్ళ మీద పడింది. వాస్తవానికి మాల్దీవులతో భారత్ ఎప్పుడూ శత్రుత్వాన్ని కోరుకోలేదు. కానీ మాల్దీవులే అనవసరంగా గెలుక్కుంది. చివరికి అది ఎంత ఇబ్బందికరమో ఆ దేశానికి తెలిసి వచ్చింది. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోడీని తమ దేశానికి ఆహ్వానించింది. రెండు రోజులపాటు నరేంద్ర మోడీ అక్కడ పర్యటిస్తారు. మాల్దీవులలో పర్యటిస్తున్న ప్రధానికి అక్కడి అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మాల్దీవ్ రాజధాని మాలే ప్రాంతంలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనంపై ఏకంగా అతిపెద్ద నరేంద్ర మోడీ భారీ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.. మోడీకి అక్కడి సైనిక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మోడీ నడిచి వస్తుండగా.. రక్షణ శాఖ కార్యాలయం పై నరేంద్ర మోడీ భారీ చిత్రపటం కనిపిస్తున్న దృశ్యాలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బలమైన నాయకుడు ఉంటే ఎంతటి రాజ్యమైనా సరే కాళ్ళ కిందికి రావాల్సిందేనని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.