https://oktelugu.com/

సినిమా వాళ్లకు ఒక పీడకల !

మొదటి బాల్ సిక్స్.. మిగిలిన బాల్స్ అన్ని వికెట్స్ అన్నట్లు ఉంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల స్థితి. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే.. ఈ 2020 మొదట్లోనే ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు‘ లాంటి సూపర్ హిట్ చిత్రాల రూపంలో ఈ ఇయర్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఈ రెండు సినిమాలు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేయడంటతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఊపు తీసుకొచ్చాయి. నిజానికి ఈ విజయాలు చూసి ఈ […]

Written By:
  • admin
  • , Updated On : July 17, 2020 / 07:08 PM IST
    Follow us on


    మొదటి బాల్ సిక్స్.. మిగిలిన బాల్స్ అన్ని వికెట్స్ అన్నట్లు ఉంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల స్థితి. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే.. ఈ 2020 మొదట్లోనే ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు‘ లాంటి సూపర్ హిట్ చిత్రాల రూపంలో ఈ ఇయర్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఈ రెండు సినిమాలు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేయడంటతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఊపు తీసుకొచ్చాయి. నిజానికి ఈ విజయాలు చూసి ఈ ఏడాది అంతా ఈ శుభారంభమే కొనసాగుతుందని.. తరువాత వచ్చే సినిమాలు కూడా ఇలాగే విజయాల్ని సాధించాలని అంతా అనుకున్నారు. కానీ ఆ విజయోత్సాహానికి పై రెండు సినిమాల దగ్గరే కామా పడిపోవడంతో సినిమా జనానికి ఏమి చేయాలో తెలియడం లేదు.

    అనుష్క అందుకే పెళ్లి చేసుకోవట్లేదట !

    అసలు ఆ మాటకొస్తే.. పై రెండు చిత్రాల తర్వాత విడుదలైన చెప్పుకోదగిన సినిమాలు ఏవీ క్లీన్ హిట్ అనిపించుకోలేక బాక్సాపీస్ వద్ద ప్లాప్ లుగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ జస్ట్ ఓకే రిపోర్ట్స్ తెచ్చుకోగా ఆ తర్వాత వచ్చిన ‘డిస్కో రాజా’ పరాజయం అవుతూనే రవితేజ మార్కెట్ స్థాయిని కూడా తగ్గించేసింది. ఇక నాగ శౌర్య ‘అశ్వధ్ధామ’ కూడా డబ్బులు చేసుకోలేక అలాగే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక.. సైలెంట్ గా సైడ్ అయిపోయింది. ఇక సమంత, శర్వాల ‘జాను’ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వీటి మధ్యలో చిన్న సినిమాలుగా వచ్చిన ‘సవారి, చూసీ చూడంగానే’ లాంటి చిత్రాలు కనీసం చిన్న విజయాన్ని కూడా సాధించలేదు.

    ఎక్స్ క్లూజివ్ : కవలలుగా మహేష్ బాబు..!

    అలాగే విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తిగా చేతులు ఎత్తేయడం.. ఆ తరువాత కరోనా రాక.. ఇక సినిమాల రిలీజ్ కూడా ఏమి లేకుండా పోయాయి. కరోనా ఎప్పుడు పోతుందో.. తెలియదు. పోనీ ఓటీటీలోనైనా సినిమాలను రిలీజ్ చేద్దామంటే.. పెట్టిన పెట్టుబడులు కూడా రావేమో అని అనుమానం. మొత్తానికి ఈ ఏడాది ఎవ్వరికీ కలిసిరాలేదు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి.. ఇండస్ట్రీలోని జనాలకు ఈ సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది. ఇప్పట్లో థియేటర్లు తెరవరు. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టాలంటే భయపడే పరిస్థితి. వీటన్నిటి మధ్యలో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా సినిమా వాళ్లకు ఈ ఏడాది ఒక పీడకలే.