https://oktelugu.com/

పూజా హెగ్డేతో అక్కినేని హీరో డేటింగ్ !

అక్కినేని అఖిల్ కి ‘మనం’ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. జస్ట్ గెస్ట్ రోల్ కే స్టార్ డమ్ సంపాధించాడని అక్కినేని ఫ్యాన్స్ మహా సరదా పడ్డారు. పాపం వారి సరదా అఖిల్ సినిమా రిలీజ్ రోజే అడ్రెస్ లేకుండా పోయింది అనుకోండి. సూపర్ స్టార్ అవుతాడనుకున్న హీరో కాస్త.. చివరికి ఎవరేజ్ హీరో రేంజ్ కి ఎదగడానికి కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దీనికి తోడు లవ్ మ్యాటర్ లో కూడా ఇప్పటికే ఒకసారి […]

Written By:
  • admin
  • , Updated On : July 17, 2020 / 07:20 PM IST
    Follow us on


    అక్కినేని అఖిల్ కి ‘మనం’ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. జస్ట్ గెస్ట్ రోల్ కే స్టార్ డమ్ సంపాధించాడని అక్కినేని ఫ్యాన్స్ మహా సరదా పడ్డారు. పాపం వారి సరదా అఖిల్ సినిమా రిలీజ్ రోజే అడ్రెస్ లేకుండా పోయింది అనుకోండి. సూపర్ స్టార్ అవుతాడనుకున్న హీరో కాస్త.. చివరికి ఎవరేజ్ హీరో రేంజ్ కి ఎదగడానికి కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దీనికి తోడు లవ్ మ్యాటర్ లో కూడా ఇప్పటికే ఒకసారి దెబ్బ తిన్నాడు ఈ యంగ్ హీరో. అప్పటి నుండి లవ్ కి దూరంగా ఉంటున్నాడనుకుంటే.. ఏకంగా ఓ స్టార్ హీరోయిన్ తోనే డేటింగ్ లో ఉన్నాడని తాజాగా సినీ సర్కిల్స్ లో ఘాటు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదట. ప్రస్తుతం మనోడితో ఒక సినిమా కూడా చేస్తుందట.

    అనుష్క అందుకే పెళ్లి చేసుకోవట్లేదట !

    కాగా అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో మాత్రమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన టాల్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అఖిల్ – పూజా హెగ్డేల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారని.. ఆ తరువాత నుండే ఇద్దరి మధ్య డేటింగ్ కూడా నడుస్తోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. అఖిల్ లేదా పూజా స్పందించాల్సిందే.

    ఓటీటీలో ‘నవరసాలు’ పండించనున్న సూర్య

    అన్నట్టు వీరి కలయికలో రానున్న సినిమాలో కూడా లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని.. అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా చాలా న్యాచురల్ గా వచ్చిందని.. ఓవరాల్ గా సినిమాలోనే రొమాన్స్ హైలెట్ గా నిలుస్తోందట. అయితే ఈ సినిమా హిట్ అవ్వకపోతే అఖిల్ మార్కెట్ మరింతగా పడిపోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా ఈ సినిమా కీలకం. రిజల్ట్ తేడాగా వస్తే.. మళ్ళీ మనోడికి ఇక డైరెక్టర్ గా అవకాశాలు రావడం కష్టమే. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోండంగా… దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నాడు. కనీసం భాస్కరైనా అఖిల్ కి భారీ విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.