https://oktelugu.com/

మాస్కులు పెట్టుకోలేదని కోటి ఫైన్..!

కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మరి మాత్రం కంట్రోల్ కావడంలేదు. రోజురోజుకు కొత్త కేసులు వేలల్లో నమోదవుతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా అవగాహన కల్పిస్తునే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బెంగుళూరులో కరోనా నిబంధనలు పాటించని వారి నుంచి ఏకంగా 1.91కోట్ల రూపాయాలు వసూలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాక్సిన్ అందించే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 6:53 pm
    Follow us on


    కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మరి మాత్రం కంట్రోల్ కావడంలేదు. రోజురోజుకు కొత్త కేసులు వేలల్లో నమోదవుతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా అవగాహన కల్పిస్తునే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బెంగుళూరులో కరోనా నిబంధనలు పాటించని వారి నుంచి ఏకంగా 1.91కోట్ల రూపాయాలు వసూలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

    వాక్సిన్ అందించే శక్తి భారత్ కే ఉందా?

    దేశంలోని మహరాష్ట్ర, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, పూణేల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ప్రజలంతా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కొందరు పెడచెవిన పెట్టడంతో వారిపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. అయితే బెంగూళూరులో గడిచిన ఒక్కనెలలో మాస్కులు ధరించని వారు నుంచి ఎంత వసూలు చేసిందో తెలిస్తే అక్కడి ప్రజలు కరోనా పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.

    బెంగుళూరులో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో బెంగూళూరు మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. అయితే మాస్కులు లేకుండా రోడ్లపై ఎవరైనా వస్తే వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు చేస్తూ బెంబేలెత్తిస్తోంది. జూన్‌ నెలలో బెంగళూరు వ్యాప్తంగా మాస్కులు లేని వారి నుంచి కోటి రూపాయాల జరిమానాలు వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంసీ చెబుతున్నారు.

    ఎట్టకేలకు కరోనాపై కేసీఆర్ సర్కార్ కు జ్ఞానోదయం?

    బెంగుళూరులో మాస్కులు ధరించనివారు, భౌతిక దూరం పాటించని వారిని గత నెలలో 50,706మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరి నుంచి ఏకంగా రూ.1.91కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మాస్కులు ధరించని వారి నుంచే కోటి రూపాయాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కరోనా నిబంధనలు పాటించకుంటే జేబులకు చిల్లుతప్పదనే సందేశాన్ని ప్రభుత్వం గట్టిగా పంపింది. అయితే ప్రభుత్వం ఫైన్లు విధించినప్పటికీ కొందరు కరోనా నిబంధనలు పాటించడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. వీరిపట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!