https://oktelugu.com/

‘మెగా’ ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ !

అక్కినేని అన్నదమ్ముల సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ నిధి అగర్వాల్ గతేడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో తొలి విజయం అందుకుంది. రామ్ సూపర్ ఎనర్జిటిక్ యాక్టింగ్ కి నిధి అందాల ప్రదర్శన ఆడ్ అవటంతోనే ఈ మూవీ ఆ రేంజ్ హిట్ అయిందని అనటంలో సందేహం లేదు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ అందుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 30, 2021 / 10:25 AM IST
    Follow us on


    అక్కినేని అన్నదమ్ముల సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ నిధి అగర్వాల్ గతేడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో తొలి విజయం అందుకుంది. రామ్ సూపర్ ఎనర్జిటిక్ యాక్టింగ్ కి నిధి అందాల ప్రదర్శన ఆడ్ అవటంతోనే ఈ మూవీ ఆ రేంజ్ హిట్ అయిందని అనటంలో సందేహం లేదు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ అందుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో వార్త చక్కర్లు కొడుతోంది.

    Also Read: విజయ్ దేవరకొండతో నా మొదటి సినిమా అలా మిస్ అయింది

    టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ పీరియాడిక్ డ్రామా సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో నిధి అగర్వాల్ ని ఒక కథానాయకిగా తీసుకున్నారని, ఇటీవలనే ఆమె షూటింగ్లో కూడా పాల్గొందని రకరకాలుగా వార్తలు వినిపిస్తిన్నాయి. మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామని సెలెక్ట్ చేశారని సమాచారం. అయితే అటు మేకర్స్, నిధి అగర్వాల్ ఎవరొకరి నుండి అధికారక ప్రకటన వచ్చే వరకు ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడేలా లేదు.

    Also Read: ‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ బాబు

    ఈ వార్తే నిజమైయితే కనుక నిధి అగర్వాల్ దశ తిరిగినట్లేనని చెప్పుకోవచ్చు. అమ్మడు దృష్టి అంతా కోలీవుడ్ మీదనే ఉందట. ఇటీవలనే సంక్రాతి కానుకగా వచ్చిన స్టార్ హీరో శింబు ‘ఈశ్వరన్’, జయం రవి ‘భూమి’ సినిమాల ద్వారా తమిళ ప్రజలకి దగ్గరయింది. నిజానికి అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. కానీ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పిక్స్ షేర్ చేసి అభిమానులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ బిజీగా ఉంటుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్