https://oktelugu.com/

సంక్రాంతి సెంటిమెంట్ వదలనంటున్న మహేష్

తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్ ని తప్పకుండా ఫాలో అయ్యే హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటారు. మూవీ ఓపెనింగ్ రోజు పూజ కార్యక్రమానికి వెళ్లకపోవటమనేది తాను సెంటిమెంట్ గా ఫీల్ అవుతానని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మహేష్ చెప్పారు. కొన్నేళ్లుగా సంక్రాంతి పండుగ సమయంలో మహేష్ మూవీ విడుదలవుతూ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. గతేడాది సంక్రాంతి కానుకగా “స‌రిలేరు నీకెవ్వ‌రు ” సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. Also Read: ‘మెగా’ ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ […]

Written By: , Updated On : January 30, 2021 / 10:35 AM IST
Mahesh
Follow us on

Sarkaru Vari Paata
తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్ ని తప్పకుండా ఫాలో అయ్యే హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటారు. మూవీ ఓపెనింగ్ రోజు పూజ కార్యక్రమానికి వెళ్లకపోవటమనేది తాను సెంటిమెంట్ గా ఫీల్ అవుతానని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మహేష్ చెప్పారు. కొన్నేళ్లుగా సంక్రాంతి పండుగ సమయంలో మహేష్ మూవీ విడుదలవుతూ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. గతేడాది సంక్రాంతి కానుకగా “స‌రిలేరు నీకెవ్వ‌రు ” సినిమాతో ప్రేక్షకులని అలరించాడు.

Also Read: ‘మెగా’ ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ !

ఈ ఏడాది కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవటంతో సంక్రాంతికి రాలేకపోయిన మహేష్ వచ్చే ఏడాది సంక్రాంతికి తన తాజా చిత్రం “స‌ర్కారు వారి పాట”తో రానున్నట్లుగా తాజాగా అప్డేట్ వచ్చింది. మహేష్ చేతిలో తాళాల గుత్తి ఉన్న పోస్టర్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించి మేకర్స్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు. చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన వారం రోజుల్లోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Also Read: ‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ బాబు

గీత గోవిందం లాంటి హిట్ మూవీ తర్వాత డైరెక్టర్ పరుశరాం దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో మహేష్ సరసన మహానటి బ్యూటీ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందించనుండగా, మధి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్