https://oktelugu.com/

వెంకటేశ్వర స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడానికి కారణం ఇదే..!

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుపతికి ఎంతో మంది భక్తులు దేశవిదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను మనం గమనించినట్లైతే స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం రాసి ఉంటారు.అయితే ఆ విధంగా స్వామి వారి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు రాస్తారు అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం…. Also Read: సకల సంపదలు మీ సొంతం కావాలంటే.. ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 30, 2021 / 09:57 AM IST
    Follow us on

    కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుపతికి ఎంతో మంది భక్తులు దేశవిదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను మనం గమనించినట్లైతే స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం రాసి ఉంటారు.అయితే ఆ విధంగా స్వామి వారి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు రాస్తారు అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం….

    Also Read: సకల సంపదలు మీ సొంతం కావాలంటే.. ఈ మంత్రం జపించాల్సిందే..!

    పురాతన కథనం ప్రకారం కలియుగ దైవం ఆ శ్రీ వారికి ఎంతో మంది భక్తులు ఉన్నారు. అలాంటి భక్తులలో అనంతాళ్వారు మొదటి వాడు అని చెప్పవచ్చు. స్వామివారి ఆలయం వెనుక ఒక తోటలో నివసించే అనంతాళ్వారు ప్రతిరోజు ఉదయం ఆ తోటలో పూసిన పువ్వులు స్వామివారి పూజకు ఉపయోగించేవారు.ఆ విధంగా అనంతాళ్వారు స్వామివారికి వివిధ రకాల పువ్వులతో పూజించాలని భావించి తన తోటలో నీటికోసం ఒక బావిని తవ్వాలని భావించాడు.

    Also Read: ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త నిబంధనలివే.

    ఈ నేపథ్యంలోనే తన తోటలో బావిని తవ్వడం మొదలు పెట్టాడు. అయితే అప్పటికే అనంతాళ్వారుని భార్య గర్భవతి కావడంతో పనిచేయడానికి కష్టపడుతోంది. దీనిని గమనించిన శ్రీవారు సాక్షాత్తు 12 ఏళ్ల బాలుడు రూపంలో వారికి సహాయం చేస్తానని అక్కడికి వెళ్ళాడు. అందుకు అనంతాళ్వారు తన స్వామివారి సేవకు ఎవరి సహాయం అవసరం లేదని చెప్పి పంపిస్తారు. అయితే ఆ బాలుడు అనంతాళ్వారుని భార్యకు సహాయం చేయడానికి రావడంతో అందుకు ఆమె ఒప్పుకుంటుంది. ఈ విధంగా తన భార్య చకచకా పని పూర్తి చేయడంతో అనుమానం వచ్చి అనంతాళ్వారు తన భార్యను నిలదీస్తే అసలు విషయం చెబుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అనంతాళ్వారుడు ఆ బాలుడి పై ఎంతో ఆగ్రహానికి గురై తన చేతిలో ఉన్న గునపం విసురుతాడు.ఆ గుణపం బాలుడు గడ్డానికి తగలడంతో అక్కడినుంచి మాయమవుతాడు. అదే సమయంలో గర్భగుడిలో ఉన్న స్వామి వారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి ఎంతో ఆశ్చర్యపోయిన అర్చకులు ఈ విషయాన్ని స్వయంగా అనంతాళ్వారునికి చెప్పడంతో ఈ విషయం గ్రహించిన అతను తనకు సహాయం చేయడానికి వచ్చింది సాక్షాత్తూ ఆ శ్రీవారుఅని భావించి తన తప్పును మన్నించాలని స్వామివారి పాదాలపై పడి వేడుకుంటాడు. అప్పటి నుంచి స్వామివారి గడ్డం నుంచి రక్తం కారకుండా, చల్లదనం కోసం అర్చకులు పచ్చకర్పూరం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.