Devara : జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలోకి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఆయన సాధించిన విజయాలను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా చేసిన దేవర సినిమా ప్రేక్షకులు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేదు. నిజానికి ఆయన చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి…మిగతా స్టార్ హీరోలను చూపిస్తూ వాళ్ళ సినిమాలకు ఆవరేజ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్స్ ను రాబడతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి మాత్రం సక్సెస్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లు రావట్లేదు అంటూ ఒక మీమైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఎందుకు భారీ కలెక్షన్స్ వసూలు చేయడం లో ఆయన ఫెయిల్ అవుతున్నాడనే విషయం అయితే ఎవరికీ అర్థం కావడం లేదు. దేవర సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఈ సినిమా లాంగ్ రన్ లో కేవలం 300 కోట్లు మాత్రమే రాబట్టింది అంటే ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియాలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… మరి అలాంటి ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకోవడానికి భారీ సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిజానికి ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ కలెక్షన్ల వరకు వస్తే మాత్రం అవి చాలా తక్కువగా ఉంటున్నాయి.
ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా సైతం 50 కోట్లతో తెరకెక్కి 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. స్టార్ హీరో స్టేటస్ ఉండి భారీ బడ్జెట్ పెట్టిన కూడా జూనియర్ ఎన్టీఆర్ 400 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి…
ఇక అందుకే అన్ని రకాలుగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఈ సినిమాను చాలామంది విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఆయన మార్కెట్ ని భారీగా విస్తరించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక భారీ రికార్డులను కూడా కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది.
ఒకవేళ ఈ సినిమాతో కనక భారీగా సక్సెస్ రాకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ అనేది డైలమాలో పడిపోతుందనే చెప్పాలి…ఇక ఇప్పుడు ఆయన స్టార్ హీరోగా వెలుగొందాలంటే మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో ఆయన భారీగా ఇబ్బంది పడే అవకాశాలైతే ఉంటాయి…