https://oktelugu.com/

RGV : బాగా తాగి ఆర్జీవీని బండ బూతులు తిట్టిన స్టార్ డైరెక్టర్…ఇంతకీ ఆయన ఎవరు..? అలా చేయడానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్న వాళ్లలో రామ్ గోపాల్ వర్మ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఎప్పుడైతే నాగార్జునతో శివ సినిమా చేశాడో అప్పట్నుంచి ఆయన క్రేజ్ ఇండస్ట్రీలో తారాస్థాయిలో నిలిచిపోయిందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 09:22 PM IST

    Ram Gopal Varma

    Follow us on

    RGV : 1990వ సంవత్సరంలో వచ్చిన శివ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టించాయి. ఇక అప్పటి వరకు ఒక దారిలో వెళ్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక దారిని వేశాడు. అలాగే మన ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం. ఇక అప్పటినుంచి తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయనే చెప్పాలి. ప్రతి ఒక్క హీరో రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయాలని అనుకునేవారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అదృష్టమైతే దక్కింది. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన సినిమాలు చాలావరకు సక్సెస్ లను సాధించడమే కాకుండా మరికొన్ని సినిమాలు డిజాస్టర్లను కూడా మూట గట్టుకున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ఒక స్టాఫ్ డైరెక్టర్ ఒకప్పుడు గోపాల్ వర్మ చేసిన సినిమా నచ్చకపోవడంతో బాగా తాగి ఆర్జీవీ కి ఫోన్ చేసి మరి ఆ సినిమా అలా ఎందుకు తీసావ్ అని బండ బూతులు తిట్టాడట… నిజానికి ఆయన వర్మ అభిమానే తన అభిమాన దర్శకుడు అలా సినిమా తీయడం నచ్చకపోవడంతో ఆయన ఆ విషయాన్ని జీర్ణించుకోలేక బండబూతులు తిట్టినట్టుగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆ దర్శకుడే తెలియజేశాడు. ఇక ఇంతకీ ఆయన ఎవరు అంటే ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని సాధించిన అజయ్ భూపతి…

    ఇక ఈయన రీసెంట్ గా మంగళవారం సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈయన మొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ అభిమాని కావడమే కాకుండా తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాకి తను కో డైరెక్టర్ గా వర్క్ చేయడం విశేషం. ఇక వర్మ స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు.

    కాబట్టి అందుకే తనకు ఫోన్ చేసి తను తిట్టినా కూడా అజయ్ భూపతిలో నిజాయితీ ఉందని తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఆర్జీవి తన శిష్యులను దర్శకులుగా సెటిల్ చేయడంలో చాలావరకు కీలకపాత్ర వహించాడు.

    ఇక అజయ్ భూపతిని కూడా తను దర్శకుడిగా సెట్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఇక మొత్తానికైతే ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి ఒక లైమ్ లైట్ లోకి వచ్చాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం అజయ్ భూపతి ఇక స్టార్ హీరోతో తన సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…