https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కి బాగా ఇష్టమైన హీరో అతనేనా..? ‘అన్ స్టాపబుల్’ షోలో షాకింగ్ సమాధానాలు!

ఈ చిత్రం కోసం అట్లీ , త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో చేయబోయే సినిమాలను పక్కన పెట్టాడు. ఇప్పుడు పుష్ప 2 విడుదల తర్వాత ఆయన ముందుగా త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాని మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రానికి సుమారుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట.

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2024 / 10:20 PM IST
    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉండే సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో కొడుకు, కూతురు ఇద్దరికీ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్హ మాట్లాడే క్యూట్ మాటలకు ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఉండరు. రీసెంట్ గానే అల్లు అర్జున్ ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 4’ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ ని వచ్చే నెలలో విడుదల కాబోతున్న ‘పుష్ప 2 : ది రూల్’ ప్రొమోషన్స్ లో భాగంగా షూట్ చేసారు. ఈ నెల మూడవ వారం లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ ఎపిసోడ్ కి తనతో పాటు అల్లు అయాన్, అల్లు అర్హ ని కూడా తీసుకొచ్చాడట అల్లు అర్జున్. ఈ సందర్భంగా అల్లు అయాన్ తో బాలయ్య మాట్లాడుతూ ‘మీ నాన్న కాకుండా నీకు ఇష్టమైన హీరో ఎవరు?’ అని అడుగుతాడట.

    దానికి అయాన్ ప్రభాస్ పేరు చెప్పినట్టు సమాచారం. దీనిని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం అల్లు అయాన్ మాత్రమే కాదు, ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ కొడుకులు, కూతుర్లు మొత్తం ప్రభాస్ అభిమానులే అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆధారాలతో సహా పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కల్కి మూవీ చూసేందుకు థియేటర్స్ కి వచ్చిన వీడియోని, అలాగే మహేష్ బాబు కూతురు సితార ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఏకైక అకౌంట్ ప్రభాస్ దే అని, ఇప్పుడు రీసెంట్ గా అల్లు అయాన్ కూడా ప్రభాస్ అభిమాని అంటూ సోషల్ మీడియా లో గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

    ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండవ వారం నుండి అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో నాన్ స్టాప్ గా పాల్గొనబోతున్నాడు. ఈనెల నాల్గవ తేదీ నుండి ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ని వారం రోజుల పాటు షూట్ చేయబోతున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టు అట. సుమారుగా మూడేళ్ళ నుండి అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే పని చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అట్లీ , త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో చేయబోయే సినిమాలను పక్కన పెట్టాడు. ఇప్పుడు పుష్ప 2 విడుదల తర్వాత ఆయన ముందుగా త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాని మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రానికి సుమారుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట.