https://oktelugu.com/

Tollywood: నెపోటిజం వల్ల ఇప్పుడున్న యంగ్ హీరోలకు దెబ్బ పడుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీనివల్ల ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలకి వాళ్ళ కెరియర్ మీద దెబ్బ పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 5:07 pm

    Tollywood(13)

    Follow us on

    Tollywood: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. దానికోసం మంచి కథలను ఎంచుకోవడమే కాకుండా దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.కారణం ఏదైనా కూడా ఇక్కడ సక్సెస్ అనేది మాత్రమే కీలక పాత్ర వహిస్తుంది సక్సెస్ లు ఉన్నవాళ్లకే ఇక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాగే వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే సక్సెస్ ఫార్ములా అనేది చాలా గొప్ప ఫార్ములా అని ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెబుతూ ఉంటారు…

    సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీనివల్ల ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలకి వాళ్ళ కెరియర్ మీద దెబ్బ పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే నెపోటిజం కారణంగా యంగ్ హీరోలకు వాళ్లకు వచ్చే అవకాశాలను వీళ్ళు అందుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానివల్ల ఇప్పుడున్న యంగ్ హీరోలకి అంత మంచి అవకాశాలు అయితే రావడం లేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వారసత్వపరంగా వచ్చిన వాళ్లే కావడం విశేషం. ఇక్కడ నెపోటిజం అనేది ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వస్తుందని దానిని తగ్గించడం ఎవరివల్ల కాదని చాలామంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా రేపు స్టార్ హీరోలుగా మారిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ గా వాళ్ల కొడుకులను సినిమా ఇండస్ట్రీలోకి దింపుతూ ఉంటారని చాలామంది చెబుతున్నారు. ఇక ఇందులో కూడా వాస్తవమైతే ఉంది. ఇండస్ట్రీ మొత్తంలో స్వసక్తితో ముందుకు వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. నెపోటిజంతో వచ్చిన వారే చాలామంది ఉన్నారని కూడా చాలా కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి.

    ఇక ఇండస్ట్రీలో తమకంటూ ఒక సపోర్ట్ ఉన్నప్పటికి ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడతారు. నెపోటిజం వల్ల ఇండస్ట్రీకి రావడానికి అవకాశం దొరుకుతుంది తప్ప సక్సెస్ లు సాధించడానికి కాదు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి అవకాశాలను ఇస్తుంది. వాటిని అందిపుచ్చుకొని సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే ఎవరైనా సరే ఇక్కడ స్టార్ హీరోగా ఎదగొచ్చు అని మరికొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    కాబట్టి నెపోటిజం అనే విషయాన్ని పక్కన పెట్టి వాళ్లకు వచ్చిన అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగితే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా స్టార్ హీరోగా ఎదగొచ్చు అనేది ఇప్పటివరకు ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ప్రూవ్ చేసి చూపించారు. ఇక వీళ్ళు కూడా అదే బాటలో నడిస్తే వాళ్లకు కూడా భారీ సక్సెస్ లు దక్కుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…