https://oktelugu.com/

Prisoners: అధికారులకన్నా ఎక్కువ సంపాదిస్తున్న ఖైదీలు.. ఎక్కడో తెలుసా?

ఖైదీలు జైల్లో ఖాళీగా ఉండకుండా వారికి ఏదో ఒక పని కల్పిస్తుంటారు. ఇలా జైల్లో పనిచేస్తూ కూడా ఖైదీలు సంపాదిస్తారు. అయితే ఖైదీలకు ఇచ్చే వేతనం చాలా తక్కువగా ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 24, 2024 5:12 pm
    Follow us on

    Prisoners: వివిధ నేరాలు చేసి కోర్టులో నేరం రుజువు అయిన వారికి న్యాయస్థానాలు జైలు శిక్ష విధిస్తాయి. ఇలా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అధికారులు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటారు. వారితో పనిచేయిస్తూ.. అందుకు వేతనం చెల్లిస్తుంటారు. ఇక జైలు అధికారులు కొన్ని కాంట్రాక్టు వర్క్‌లు చేపట్టి ఫర్నిచర్‌ చేయించి ఇస్తుంటాయి. పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసి అందులో ఖైదీలకు పని కల్పిస్తుంటారు. ఖైదీలు పనిచేసి సంపాదించిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే వీరు సంపాదించేది చాలా తక్కువే ఉంటుంది. అయితే ఇక్కడ ఖైదీలు మాత్రం అక్కడి అధికారులకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారట. అలా ఎలా సాధ్యమవుతుంది.. వారు చేస్తున్న పని ఏంటి.. ఎక్కడ ఖైదీలు ఎక్కువ సంపాదిస్తున్నారు అనే వివరాలు చూద్దాం.

    పరివర్తన కోసం..
    జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైలు అధికారులు వారితో పనులు చేయిస్తారు. కొందరు దిగులును మర్చిపోవడానికి, వారి దృష్టిని పనిపైకి మళ్లిస్తారు. ఇలా పనులు చేసిన వారికి డబ్బులు ఇస్తాయి. అయితే యూకేలోని జైళ్లలో ఖైదీలు ఉపాధి పొందుతూ అక్కడి అధికారుకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఈమేరకు తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది. లండన్‌లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఓపెన్‌ జైళ్లలో ఉంచుతారు. వీరు బయటకు వెళ్లి ఉపాధి పొందడానికి అవకాశం కల్పిస్తారు. అలా వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్న ఖైదీలు జైల్లో ఉండే సెక్యూరిటీ గార్డులు, సెకండరీ టీచర్లు, బయోకెమిస్టు, సైకో థెరపిస్టు కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు.

    అత్యధిక వేతనం..
    యూకేలో ఖైదీలు కొందరు అత్యధికంగా ఏడాదికి 46,005 డాలర్లు (రూ.38,84,491) నికర వేతనం పొందుతున్నట్లు తాజాగా నివేదికలు తెలిపాయి. మరికొందరు ఖైదీలు 28,694(రూ.24,22,814) కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు. జైలు గార్డు సగటు జీతం 35,085 డాలర్లు(రూ.29,62,446), మరికొందరు లారీలు, బస్సులు సైతం నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. శిక్ష కాలం ముగిసే సమయానికి డ్రైవర్‌గా పనిచేసేవారికి తాత్కాలిక లైసెన్స్‌ కూడా జారీ చేస్తారు.

    సంపాద నుంచే అన్నీ..
    ఇక ఖైదీలు తమ కష్టార్జితం నుంచే పన్నులు, కోర్టు జరిమానాలు చెల్లిస్తారని నివేదిక తెలిపింది. వీరు తమ సంపాదనలో కొంత భాగం స్వచ్ఛంద సంస్థలకూ అందిస్తారని వెల్లడించింది. శిక్ష కాలం ముగిసిన అనంతరం వారు పరివ్తన చెందిన వ్యక్తులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు