https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కు తీరని కోరిక ఇదే.. సంచలన విషయం బయటపెట్టిన ‘పుష్ప’హీరో..

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ‘డాడీ’ సినిమాలో డ్యాన్సర్ గా కనిపించి అలరించాడు. ఆ తరువాత ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తాను నటించిన మొదటి సినిమా హిట్టు అయినా.. ఆ సమయంలో బన్నీని ఎవరూ పట్టించుకోలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 25, 2024 / 03:00 AM IST

    Allu Arjun(4)

    Follow us on

    Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుంచి పదుల కొద్దీ నటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన ‘పుష్ఫ’ మూవీకి వరల్డ్ లెవల్లో గుర్తింపు రావడంతో విశేష గుర్తింపు లభించింది. బన్నీ నటిస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైనమిక్ హీరో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ‘అన్ స్టాపబుల్ 2 ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సాగే ఇందులోకి బన్నీ తన ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా తన కూతురు అర్హ ఓ తెలుగు పద్యంతో ఆకట్టుకుంది. ఇదే సమయంలో బన్నీ సైతం తన పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యాడు. తన జీవితంలో ఓ తీరని కోరిక ఉందని చెప్పాడు. అదేంటంటే?

    మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ‘డాడీ’ సినిమాలో డ్యాన్సర్ గా కనిపించి అలరించాడు. ఆ తరువాత ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తాను నటించిన మొదటి సినిమా హిట్టు అయినా.. ఆ సమయంలో బన్నీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ హీరోకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఆర్య’ అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలు లవర్ భాయ్ గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక రకంగా ఈ సినిమా తరువాత ట్రెండ్ మారిందని కూడా చెప్పొచ్చు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాలకు హైలెట్ గా నిలిచింది. ఆర్య సక్సెస్ కావడంతో దీని సీక్వెల్ కూడా వచ్చింది. అయితే మొదటి సినిమాకు వచ్చిన గుర్తింపు పార్ట్ 2 కు రాలేదని చెప్పొచ్చు.

    అల్లు అర్జున్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్య సినిమా గురించి చెబూతూ ఉంటారు. రీసెంట్ గా ఆయన ‘అన్ స్టాపబుల్ 2’ వేదికగా బన్నీ ఆర్య గురించి మాట్లాడారు. తన జీవితంలో మరిచిపోలని సినిమా ‘ఆర్య’ అన్నాడు. అయితే ఈ సినిమాలో తన తీరని కోరిక ఒకటి ఉండేదని బన్నీ చెప్పాడు. ఈ సినిమాలో తన తాత అల్లు రామలింగయ్యకు ఒక పాత్ర ఉంటే బాగుండేదని చెప్పాడు. దీంతో జీవితాంతం తనకు గుర్తుండిపోయేదని అన్నారు. అలాగే తనకు జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తన తాత ఉంటే ఎంతో సంతోషిచేవారని చెప్పారు. తన జీవితాన్ని నిలబెట్టింది తాతేనని, గంగోత్రి, ఆర్య సినిమాల సమయంలో తనను చూసి తాత మురిసిపోయాడని చెప్పాడు.

    ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న బన్నీ ఈ సినిమా తరువాత ప్రాజెక్టు ప్రకటించలేదు. అయితే పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన పార్ట్ 2తో వరల్డ్ లెవల్లో గుర్తింపు వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుంది. సినిమా కూడా ప్రభంజనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే పుష్ప 2 డిసెబఱ్ 5న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ డేట్ వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వనుంది.