Jailor 2 : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వల్ గా ‘జైలర్ 2’ అనే సినిమాని కూడా తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే…
రజనీకాంత్ హీరోగా చేస్తున్న ప్రతి సినిమా మీద యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిలో మంచి హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న కూలీ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా జైలర్ సినిమాకి సీక్వల్ గా ‘జైలర్ 2’ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇంతకుముందు నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. అది ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో పాటుగా ప్రేక్షకులందరిని కట్టిపడేసింది. నిజానికి ఈ సినిమాతో నెల్సన్ మరోసారి తన దైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జైలర్ సినిమా లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు క్యామియో రోల్స్ పోషించిన విషయం మనకు తెలిసిందే.
ఇక జైలర్ 2 సినిమా కోసం తెలుగులో స్టార్ హీరోలను దింపబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే నెల్సన్ తెలుగు సినిమా స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నారట. ఇక రజనీకాంత్ కూడా నెల్సన్ ఈ సినిమాలో ఎవరినైతే భాగం చేయాలనుకుంటున్నాడో వాళ్ళ పేర్లు చెబితే వాళ్ల చేత నటింప చేయిస్తానని మాట ఇచ్చారట.
కాబట్టి నెల్సన్ ఎవరి పేరు అయితే చెబితే వాళ్ళు ఈ సినిమాలో భాగం కాబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో బాలయ్య బాబును ఇన్వాల్వ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనతో పాటుగా చిరంజీవిని కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించడానికి తెలుగు హీరోలందరూ ఆసక్తి చూపిస్తున్నారు. రజినీకాంత్ అడిగితే మాత్రం కాదనే వారు ఎవరు లేరనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం రజనీకాంత్ మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ కి తన పంజా దెబ్బను రుచి చూపించిన వాడవుతాడు…