https://oktelugu.com/

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. అదే గనుక అమల్లోకి వస్తే క్రికెటర్లకు కోలుకోలేని షాక్..

వన్డేలలో నెంబర్ వన్.. టి20 లలో నెంబర్ వన్.. టెస్టులలో నెంబర్ వన్.. ఇలా అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉన్న టీమ్ ఇండియా (team India) కొంతకాలంగా సరైన క్రికెట్ ఆడలేక పోతోంది. కీలకమైన మ్యాచులలో చేతులెత్తేస్తోంది. స్వదేశంలో, విదేశీ గడ్డపై ఇదే తీరుగా ఆడుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 15, 2025 / 05:28 PM IST

    BCCI

    Follow us on

    BCCI: గత ఏడాది టీమిండియా ఒకే ఒక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక చేతిలో ఆడిన ఆ సిరీస్ లో టీమిండియా ఓటమిపాలైంది. 2025లో స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది. టీమిండియా గత ఏడాది నాలుగు టెస్టు సిరీస్ లు ఆడగా.. రెండిట్లో గెలిచింది.. మరో రెండిట్లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా(cricket Australia)పై, స్వదేశంలో న్యూజిలాండ్(New Zealand) పై ఓడిపోయింది. ఈ ఓటములు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ (world test champion finals) అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత రెండు సీజన్లలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్ళింది. మొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్ళినప్పుడు న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయింది. రెండవసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ముచ్చటగా మూడోసారి ఫైనల్స్ వెళ్లాలి అనుకుంటున్న తరుణంలో న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టులు, ఆస్ట్రేలియా చేతిలోనూ 3 టెస్ట్ లలో ఓటమిపాలైంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను కోల్పోయింది.

    బీసీసీఐ కీలక నిర్ణయం

    టెస్టులలో మూడో స్థానానికి టీమిండియా పరిమితం కావడంతో బీసీసీఐ (BCCI) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్ల ఆట తీరుపై ప్రతిక్షణం దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఆటగాళ్ల ఆట తీరు ప్రకారమే చెల్లింపులు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం ఆటగాళ్ల ప్రదర్శన సరిగా లేకుంటే వారి సంపాదనలో కచ్చితంగా కోతపడుతుంది.. అలాంటప్పుడు ఆడే ఆటగాళ్లకు మాత్రమే మెరుగైన వేతనం లభిస్తుంది. లేనిపక్షంలో అందులో కోతపడుతుంది. అయితే ఈ నిర్ణయాన్ని కొంత మంది ఆటగాళ్లు సమర్థిస్తుంటే.. మరి కొంతమంది ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. బిసిసిఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆటగాళ్ల పై ఒత్తిడి అధికంగా ఉంటుందని.. దానివల్ల ఆటతీరు తీవ్రంగా ప్రభావితమవుతుందని చెబుతున్నారు..” బీసీసీఐ తీసుకోబోతున్న నిర్ణయం ఎలా ఉందంటే.. ఒత్తిడి అధికంగా పెంచేలా ఉంది. దీనివల్ల ఆటగాళ్లు ఆట తీరుపై మనసు లగ్నం చేసే అవకాశం ఉండదు. పైగా ఒత్తిడి వల్ల వారు తప్పులు చేసే ప్రమాదం లేకపోలేదు. అలాంటప్పుడు టీమ్ ఇండియా పరువు మరింత కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆటగాళ్ల ఆట తీరు మార్చాలనుకుంటే బిసిసిఐ ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి. ఆలోచనలను అమల్లో పెట్టాలి. అంత తప్ప ఇలా చేస్తే భవిష్యత్తు కాలంలో మరిన్ని ఇబ్బందులు తప్పవు. అందువల్ల బిసిసిఐ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని” సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.