https://oktelugu.com/

Game changer : గేమ్ చేంజర్ స్ర్కిప్ట్ లో ఈ చిన్న మిస్టేక్ ను కూడా శంకర్ గమనించలేదా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 15, 2025 / 05:19 PM IST

    Game changer

    Follow us on

    Game changer : రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డివైడ్ టాక్ ను తెచ్చుకొని ముందుకు సాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులను ఈ సినిమా అంత సాటిస్ఫై చేయలేదనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాను చేసిన క్రమంలో ఈ సినిమా అతనికి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా స్క్రిప్ట్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికి అది శంకర్ రేంజ్ సినిమా అయితే కాదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా స్క్రిప్ట్ లో ఒక చిన్న మిస్టేక్ ని కూడా గమనించలేకపోయాడా? లేదంటే కావాలనే అలా పెట్టాడా అనే విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది ఏంటి అంటే గేమ్ చేంజర్ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా నటించిన రామ్ చరణ్ కి తల్లిగా అంజలి నటించారు.

    అయితే ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జరిగిన ఇన్సిడెంట్ లో ఆమె మెడ అనేది ఒక్కవైపే తిరిగి ఉంటుంది. దానివల్ల ఆమె స్ట్రైయిట్ గా మనుషుల్ని చూడలేదు. మెడని ఒక సైడ్ తిప్పు ఉంచడం వల్ల ఆమెకు మనుషులను చూడటం లో కొంత ఇబ్బంది అయితే ఉందనేది చాలా స్పష్టంగా తెలియజేశాడు.

    ఇక ఇదిలా ఉంటే సేమ్ అలాంటి క్యారెక్టర్ తోనే కమెడియన్ అయిన సునీల్ ను కూడా ఓపెన్ చేశాడు. ఆయన కూడా ఒక సైడు తిరిగి ఉంటాడు. సైడ్ కి నడుస్తూ ఉంటాడు ఆయన నడుస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక ప్రాబ్లంతో ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరి అంత ఎమోషనల్ క్యారెక్టర్ ను అంజలి విషయంలో రాసుకున్న శంకర్ సేమ్ అలాంటి క్యారెక్టర్ తోనే సునీల్ తో మళ్ళీ కామెడీ ఎందుకు చేయించాడు. దీనివల్ల అంజలి క్యారెక్టర్ కి ఉన్న ఎమోషన్ అనేది ప్రేక్షకుడికి ఎక్కదు.

    తద్వారా ఆ క్యారెక్టర్ ని కామెడీ చేసినట్టుగా అవుతుంది అనే ఒక చిన్న లాజిక్ ను కూడా మర్చిపోయిన శంకర్ ఈ సినిమాని ఎందుకోసం తీశాడా అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో శంకర్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా బెస్ట్ ఔట్ పుట్ వచ్చేదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం…