Nayanthara And Shimbu: ఒకప్పుడు ప్రేమ జంటలు గా చెన్నై మొత్తం చక్కర్లు కొట్టిన శింబు – నయనతార కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ఒకే సమయంలో హ్యాక్ అవ్వడం ఇప్పుడు సంచలనం గా మారింది. ఎంతోమంది సెలబ్రిటీస్ ఉండగా కేవలం ఈ మాజీ ప్రేమికుల ట్విట్టర్ అకౌంట్స్ మాత్రమే ఎందుకు హ్యాక్ అయ్యాయి అనేది ఇప్పుడు అభిమానుల్లో మెలిగిన ప్రశ్న. ఈరోజు మధ్యాహ్నం శింబు అకౌంట్ నుండి ‘ఎవరైనా క్రిప్టో కరెన్సీ వాడుతున్నారా?, అలా వాడే వారి కోసం త్వరలోనే ఒక సంచలన ప్రకటన చేయబోతున్నాను’ అంటూ ఒక ట్వీట్ పడింది. ఈ ట్వీట్ ని కాసేపటి తర్వాత ఆ అకౌంట్ నుండి తొలగించారు. ఇదే విధంగా నయనతార అకౌంట్ నుండి కూడా ట్వీట్లు పడ్డాయి. ఆ తర్వాత అప్రమత్తమై ఆమె ట్వీట్ వేస్తూ ‘నా అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసారు.
ఈరోజు ఈ అకౌంట్ నుండి ఏమైనా ట్వీట్స్ ఇంతకు ముందు పడుంటే దయచేసి పట్టించుకోకండి, అవి నేను వేసింది కాదు’ అంటూ ఒక ట్వీట్ వేసింది. వీళ్లిద్దరి అకౌంట్స్ ఒకే మాదిరిగా హ్యాక్ అవ్వడం చూస్తుంటే ఎవరో కావాలని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. గత కొద్ది రోజుల క్రితమే మన టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ అకౌంట్ కూడా ఇలాగే హ్యాక్ అయ్యింది. ఆయన కూడా ఇదే మాదిరిగా నా అకౌంట్ హ్యాక్ అయ్యింది, హ్యాక్ చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని ట్వీట్ వేసాడు. ఈ సంఘటనలు జరగక నెల రోజులు ముందు రెండు మిలియన్ కి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అయ్యింది. ఇదే మాదిరిగా క్రిప్టో కరెన్సీ గురించి వీడియోలు అప్లోడ్ చేసారు ఆ ఛానల్ లో. కేవలం ఒకసారి కాదు, రెండు మూడు సార్లు జనసేన పార్టీ హ్యాండిల్ ఇలా హ్యాక్ అయ్యింది. ఇలా హ్యాక్ చేస్తున్నది ఎవరు అనే విషయాన్ని పరిశీలిస్తే చైనా దేశం కి చెందిన హ్యాకర్స్ పనిగట్టుకొని ఇలా ఇండియా లో ఉండే పాపులర్ సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేస్తున్నట్టుగా తెలిసింది.
కేవలం సినీ సెలెబ్రెటీలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ని మాత్రమే కాదు, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన అకౌంట్స్ కూడా గడిచిన రెండు సంవత్సరాలలో హ్యాక్ అయ్యాయి. సినీ సెలెబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ అయినా పర్వాలేదు కానీ, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి లీడర్స్ అకౌంట్లు హ్యాక్ అయితే పరిస్థితి ఏమిటి?, దేశానికీ, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఇలా హ్యాకింగ్ కి గురైతే రాబోయే రోజుల్లో ఎదో ఒక విపత్తు ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఎతికల్ హ్యాకర్స్ ఆటలను అరికట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.