TANA Foundation : విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకి సహాయార్ధం మంత్రి కొలుసు పార్థ సారధి గారు సూచన మేరకు వెయ్యి దుప్పట్లు, వెయ్యి టవల్స్ తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీ రాజ కసుకుర్తి, సభ్యులు గోగినేని కార్తీక్ సమకూర్చారు. సుంకోళ్ళు గ్రామం ఆధ్వర్యంలో 100 రైస్ బాగ్స్ విజయవాడ తరలించారు, ఇవి శుక్రవారం నాడు మంత్రి సారధి గారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు విజయవాడ కృష్ణలంక ఏరియాలో పంపిణి చేశారు.