Homeఎంటర్టైన్మెంట్'లేడీ సూపర్ స్టార్' పెళ్లికి డేట్ ఫిక్స్ !

‘లేడీ సూపర్ స్టార్’ పెళ్లికి డేట్ ఫిక్స్ !

లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ పెళ్ళి పై పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా రాస్తూనే ఉన్నారు, వాటిని అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అయినా, నయనతార మాత్రం పెళ్లి చేసుకోదు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా ఈ ముదురు భామకు ఫుల్ క్రేజ్ ఉండటంతో.. ఆమె పై ఎన్ని పుకార్లు వచ్చినా, అవి ఫుల్ వైరల్ అవుతూనే ఉన్నాయి. దాదాపు […]

Nayanthara
లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ పెళ్ళి పై పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా రాస్తూనే ఉన్నారు, వాటిని అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అయినా, నయనతార మాత్రం పెళ్లి చేసుకోదు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా ఈ ముదురు భామకు ఫుల్ క్రేజ్ ఉండటంతో.. ఆమె పై ఎన్ని పుకార్లు వచ్చినా, అవి ఫుల్ వైరల్ అవుతూనే ఉన్నాయి. దాదాపు ఆరేళ్లుగా విఘ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తోంది నయనతార. ఏ క్షణానైనా ఈ జంట పెళ్లి చేసుకుంటుందంటూ గత కొన్ని నెలలుగా వార్తలు మరింత ఎక్కువయ్యాయి.

Also Read: నటి కోరిక.. సై అంటే పవన్ కు 4వ భార్యగా వస్తుందట..!

మరీ ముఖ్యంగా అటు విఘ్నేష్, ఇటు నయన్ కూడా ఆ వార్తలను ఖండించకపోవడంతో ఆ ఊహాగానాలుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా నయన్-విఘ్నేష్ పెళ్లి పై మరో అప్ డేట్ తెలిసింది. ఓ చర్చిలో ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సమ్మర్ టైమ్ లోనే పెళ్లి చేసుకోవడానికి మరో రీజన్ కూడా ఉంది. వీరిద్దరూ ఏప్రిల్ నుండి జూన్ వరకూ ఎలాంటి సినిమా షూటింగ్స్ ను పెట్టుకోలేదట.

Also Read: వైల్డ్ డాగ్ః ఓటీటీ అగ్రిమెంట్‌ చింపేశారు స‌రే.. థియేట‌ర్లో టిక్కెట్లు చింపగలరా..?

అందుకే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో పెళ్లి చేసుకుంటే కాల్షీట్ల సమస్య కూడా ఉండదు అని నయనతార ప్లాన్ చేసుకుంటుంది. పనిలోపనిగా వెంటనే అనగా ‘మే’లో హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్లాన్ చేసుకునే విఘ్నేష్ చేతులతో మూడు ముళ్లు వేయించుకోవాలని నయన్ ఆరాటపడుతోంది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కొత్తగా అవకాశాలు వస్తోన్నా.. నయనతార మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper