లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు ఉన్న క్రేజ్ మిడియమ్ రేంజ్ స్టార్ హీరోలకు కూడా లేదు. పైగా రెమ్యునరేషన్ ల విషయంలో కూడా నయనతారది ఒక మెట్టు ఎక్కువే. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో నయనతార అంటే.. స్టార్ హీరోతో సమానం. నిజంగా నయనతారకు అంత డిమాండ్ ఉందా అని అనుమానం రావొచ్చు గాని, తమిళంలో నయనతార సినిమాలకు ఫుల్ మార్కెట్ ఉంది. మార్కెట్ ఉందనే.. ఆమె అడిగినంత ఇస్తున్నారు, సినిమా ప్రమోషన్స్ కు రాలేను అంటే.. సరే అంటున్నారు. ఇలాగే మరో హీరోయిన్ చేస్తే.. ఈ పాటికే ఆ హీరోయిన్ కెరీర్ సైడ్ అయిపోయేది. కానీ, నయనతారకు మాత్రం డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉంది.
Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి
అందుకే తమిళ్ మీడియా కూడా నయనతార పై పుట్టించే పుకార్ల పరంపరతోనే బండి లాగిస్తోంది. దానికి తోడు నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమ కథలు ఎక్కువైపోవడం, అప్పట్లో ఆమె ఎఫైర్స్ గురించి కూడా విపరీతంగా వార్తలు రావడం.. మొత్తానికి నయనతార అనగానే ఒక ప్రేమ పిపాసిలా తమిళ్ మీడియా ఆమెను ముందు నుంచీ ప్రొజెట్ చేస్తూ వచ్చింది. తమకు అవసరమైన ప్రతిసారి ఎప్పటికప్పుడు ఆమె గురించి కథలుకథలుగా తప్పుడు వార్తలను రాసుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంది తమిళ్ మీడియా.
ఈ క్రమంలోనే నయనతారకు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేశారు. రెండు సార్లు కరోనా వచ్చిందని జనాన్ని నమ్మించారు. ఇప్పుడు తాజాగా నయనతారకు మళ్లీ పెళ్లి చేసారు. విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందని తమిళ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తూ ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం అని నయనతార మేమేజర్ తాజాగా తమిళ మీడియాకి క్లారిటీ ఇచ్చాడు. అయినా, ఆయనగారు ఇప్పుడు కొత్తగా క్లారటీ ఇచ్చేది ఏముంది. తాము రాసింది అబద్ధం అని తమిళ మీడియాకి తెలుసు కదా. ఇక్కడ నయనతారది కూడా తప్పు ఉందిలేండి.
Also Read: ఫ్యాన్స్‌కు పండగే.. రజినీ- కమల్ కాంబో ఫిక్స్..
ఇప్పటికే రెండు మూడు విఫలమైన ఘాటు ప్రేమ కథలను పెట్టుకుని కూడా.. గత ఐదేళ్లుగా విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతూ ఉంది. అసలు నయనతార అతనిని ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే… ఇలాంటి వార్తలు రావు కదా.. ఎప్పటికపుడూ ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. పెళ్లి వద్దు అంటే.. ఇక తప్పుడు వార్తలు రాయకుండా మీడియా మాత్రం ఎందుకు ఉంటుంది. ఇప్పటికైనా నయనతారలో మార్పు వస్తే బెటర్.