https://oktelugu.com/

అలా దొంగతనం చేశాడు.. ఇలా దొరికిపోయాడు!

మారుతున్న కాలంతో పాటే దొంగలు దొంగతనాలు చేసే తీరు కూడా మారుతోంది. పలు కేసుల్లో దొంగతనాలు జరిగినా ఒక్క క్లూ కూడా దొరక్కుండా దొంగలు జాగ్రత్తలు తీసుకోవడంతో పోలీసులకు కేసులు చేధించటం కష్టమవుతోంది. కానీ తాజాగా ఒక దొంగ మాత్రం తన తెలివితక్కువతనంతో సులభంగా దొరికిపోయాడు. అతడు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన తీరు నవ్వు తెప్పిస్తోంది. ఒక దొంగ దొంగతనంచేయడం కోసం ఏకంగా ఆంబులెన్స్ నే ఎంపిక చేసుకున్నాడు. ఆంబులెన్స్ లో డ్రైవర్ లేకపోవడంతో వాహనాన్ని ఎత్తుకెళ్లడానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 18, 2020 / 07:00 PM IST
    Follow us on

    మారుతున్న కాలంతో పాటే దొంగలు దొంగతనాలు చేసే తీరు కూడా మారుతోంది. పలు కేసుల్లో దొంగతనాలు జరిగినా ఒక్క క్లూ కూడా దొరక్కుండా దొంగలు జాగ్రత్తలు తీసుకోవడంతో పోలీసులకు కేసులు చేధించటం కష్టమవుతోంది. కానీ తాజాగా ఒక దొంగ మాత్రం తన తెలివితక్కువతనంతో సులభంగా దొరికిపోయాడు. అతడు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన తీరు నవ్వు తెప్పిస్తోంది.

    ఒక దొంగ దొంగతనంచేయడం కోసం ఏకంగా ఆంబులెన్స్ నే ఎంపిక చేసుకున్నాడు. ఆంబులెన్స్ లో డ్రైవర్ లేకపోవడంతో వాహనాన్ని ఎత్తుకెళ్లడానికి అదే సరైన సమయం అని భావించాడు. ఆంబులెన్స్ లోపలికి వెళ్లి వాహనాన్ని స్టార్ట్ చేయగా వెంటనే హెల్త్ వర్కర్లు అతడిని పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే బ్లాక్ పూల్ అనే ప్రాంతంలో ఒక వృద్ధుడు అనారోగ్యంతో బాధ పడుతుండగా అతన్ని తీసుకెళ్లడం కోసం ఆంబులెన్స్ వచ్చింది.

    రోగికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉండటంతో హెల్త్ వర్కర్లు ఆంబులెన్స్ ను అక్కడే ఆపి రోగికి వైద్యం చేస్తున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సీట్లో డ్రైవర్ లేడు. ఆ సమయంలోనే తెలివి తక్కువ దొంగ దొంగతనానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. లోపల ఉన్న హెల్త్ వర్కర్ ఇదంతా గమనించి వెంటనే దొంగను పట్టుకున్నాడు. అనంతరం హెల్త్ వర్కర్లు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించగా తాగిన మత్తులో అలా చేశానని క్షమించి వదిలేయాలని డ్రైవర్ ఆంబులెన్స్ నిర్వాహకులను వేడుకున్నాడు.