పవన్ కళ్యాణ్ ను చూస్తే ఒక విప్లవ నాయకుడిని చూసినట్టు ఉంటుంది. ఒక నక్సలైట్ వీరావేశంతో అరిచినట్టు ఉంటుంది. క్యూబా కమ్యూనిస్టు విప్లవ యోధుడు చేగువేరా ఆదర్శంగా పవన్ ఉంటాడు. కమ్యూనిస్టులను ఆరాధిస్తాడు. నిజానికి కమ్యూనిజం అంటే నాస్తికవాదం.. ఆధ్యాత్మికతకు వీరంతా దూరంగా ఉంటారు. విగ్రహారాదనను వ్యతిరేకిస్తారు. మొన్నటివరకు పవన్ అలానే ఉండేవాడు. కానీ సడన్ గా మారిపోయాడు.. ఎంతలా అంటే ఎవ్వరూ ఊహించని విధంగా..
Also Read: ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?
ఒక రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా ప్రజల్లోనే ఉంటాడు. వారి కోసమే తపిస్తాడు. కానీ పవన్ తీరు పూర్తి భిన్నం. ఆయన అమావాస్య, పౌర్ణమికి మాత్రమే రాజకీయాలు చేస్తాడు.. మిగతా టైంలో సైలెంట్ అయిపోతాడు. కానీ ఇప్పుడు తనకు అస్సలు పడని ఆధ్మాత్మికంలో పవన్ కూరుకుపోయాడు.. ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అత్యంత అరుదుగా సాధువులు.. సన్యాసులు మాత్రమే చేసే ‘చాతుర్మాస్య దీక్ష’ చేస్తున్నాడు. ఇది పూర్తిగా హిందూ కర్మ. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. కుల, మతవాదానికి వ్యతిరేకంగా తాను భారతీయుడిని అని ప్రకటించిన మనిషి. అలాంటి పవన్ ఇంతటి కఠినమైన దీక్షను స్వీకరించడం అందరినీ షాక్ కు గురిచేసింది.
నిజానికి ఈ దీక్షతో పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవ్వడానికి చేసిన ప్లాన్ అని కొందరంటున్నారు. వింతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చాతుర్మాస్య దీక్షలో ఎక్కడికి వెళ్లకూడదు. కానీ విరామం ఇచ్చి ఇటీవల తన అభిమాని, హీరో నితిన్ వివాహానికి హాజరయ్యాడు. అదే సమయంతో తన అన్న బిడ్డ నిహారిక నిశ్చితార్థానికి మాత్రం డుమ్మా కొట్టాడు.
Also Read: “చంద్రబాబు ని ఎందుకు బిజెపి ఏమీ అనకూడదు…?” ఈ ఏడుపు ఎవరిది?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2024 ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు లీక్ అవుతున్నాయి. జనసేన ఏపీలో బలంగా తయారవడంతోపాటు 2024లో అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష బూనినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హిందుత్వవాదాన్ని బలపరిచే బీజేపీకి అదే ఆయుధంతో కొట్టాలని ఈ దీక్ష చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.