Nayani Pavani: బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ ఎందుకు అయిందో చెప్పిన నయని పావని

కొంచెం పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలిపినట్టు అనిపించినా.. ఈమెకు ఓ ప్రేమ కథ ఉందట. ఈమె చేతిపై ఎస్, జే అనే ఓ టాటూ ఉండడంతో ఈ నిజం బయటకు వచ్చింది.

Written By: Suresh, Updated On : October 17, 2023 3:15 pm

Nayani Pavani

Follow us on

Nayani Pavani: బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఆరు రోజులు మాత్రమే ఉన్నా.. మంచి క్రేజ్ సంపాదించింది. శోభా ఎలిమినేట్ అవుతుందనుకున్న నేపథ్యంలో నయని ఎలిమినేట్ అవడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. గతంలో డల్ గా ఆడిన శోభా తన ఆటను క్రేజీగా, అందరిని ఆకట్టుకునేలా ఆడడంతో ఈ సారి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది అమ్మడు. ఓటింగ్ తక్కువ రావడంతో ఆరు రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది నయని పావని. అయితే ఒక్కసారిగా ఎలిమినేట్ అని నయని పేరు నాగార్జున చెప్పడంతో ఇల్లు దద్దరిల్లేలా ఏడ్చింది ఈ అమ్మడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే అందరితో కనెక్ట్ అవడంతో ఇంట్లో వాళ్లు కూడా తెగ ఎమోషనల్ అయ్యారు.

కొంచెం పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలిపినట్టు అనిపించినా.. ఈమెకు ఓ ప్రేమ కథ ఉందట. ఈమె చేతిపై ఎస్, జే అనే ఓ టాటూ ఉండడంతో ఈ నిజం బయటకు వచ్చింది. ముందుగా టాటూ మీనింగ్ షణ్ముఖ్ జస్వంత్ అనుకున్నారు కానీ అది వాస్తవం కాదని తెలిసింది. అయితే ఈ టాటూ వెనుక మరో వ్యక్తి ఉన్నారట. ముందుగా షణ్ను, పావని కలిసి కవర్ సాంగ్స్ చేసి వాటిని డిలీట్ చేయడంతో అందరికి వీరిద్దరి మీదనే అనుమానం వచ్చింది. అయితే నయని ప్రేమించిన వ్యక్తి పేరు కూడా జేతోనే మొదలవుతుందట. ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. అందుకు కారణం కూడా చెప్పింది నయని.

ప్రేమించిన వ్యక్తి ఫ్రీడమ్ ఇవ్వకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. అయితే తనకు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని.. ఇలా ఉండాలి, అలా ఉండాలనే రూల్స్ ఉండేవని.. తన జీవితం మొత్తం అతనికి ఇచ్చేసినా కూడా విలువ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందట. అతని చేతిలో ఒక కీలు బొమ్మలా అయిందట. అంతేకాదు ఏకంగా నువ్వు చిన్న మొక్కవి నేనే నీళ్లు పోసి పెంచుతున్నా అని చెప్పాడంట.. ఆ మాట ఇంకా మర్చిపోలేకపోతున్నాను అని ఆవేదన చెందింది నయని. నేను చిన్న మొక్కనా? అయినా తను పెంచడం ఏంటి? లవ్, లైఫ్ రెండు తనకు ఇస్తే.. తను కంట్రోల్లోకి తీసుకోవడం నాకు నచ్చలేదు. అందుకే బ్రేక్ అప్ అయిందని చెప్పింది ఈ అమ్మడు.