AP Liquor: ఏపీలో మద్యం తాగితే చావులే.. ఆసుపత్రుల్లో సగం రోగులు వారే

ఏపీలో కనిపించే మద్యం దేశంలో ఎక్కడా కనిపించదు. కనీస పరీక్షలు కూడా చేయనమద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి.. చిత్ర విచిత్రమైన బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 17, 2023 2:47 pm

AP Liquor

Follow us on

AP Liquor: ఏపీలో మద్యం మరణాలు వెలుగుచూస్తున్నాయి. మద్యం అలవాటుతో అవయవాలు పాడైపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి జగన్ సర్కార్ చర్యలే కారణమని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ వస్తోంది. ఎప్పుడు వినని బ్రాండ్లు, చూడని మద్యం సీసాలు ఏపీలో కనిపిస్తున్నాయి. జే బ్రాండ్ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తుండగా.. గత ప్రభుత్వం అనుమతించిన కంపెనీలే నుంటూ జగన్ దుబాయిస్తూ వస్తున్నారు.

ఇటువంటి తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం విధానంపై పోరాడడం ప్రారంభించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ మద్యం విషయంలో జరుగుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల పురందేశ్వరి నరసాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్రయవిక్రయాలపై ఆరా తీశారు. అవినీతిని బయటపెట్టారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు. మద్యం తాగడం వల్లే అనారోగ్యానికి గురయ్యారన్న మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆరా తీయగా.. సగం రుగ్మతలకు ఏపీలో సరఫరా అవుతున్న మద్యమే కారణమని తేలింది.

ఏపీలో కనిపించే మద్యం దేశంలో ఎక్కడా కనిపించదు. కనీస పరీక్షలు కూడా చేయనమద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి.. చిత్ర విచిత్రమైన బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలోనే సొంత చీఫ్ లిక్కర్ బ్రాండ్ వైసీపీ అభ్యర్థులు రాష్ట్రమంతా దొంగతనంగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి మద్యం అధికారిక వైన్ గా మారిపోయింది.అది నాణ్యతలేని మద్యం అని తెలుగుదేశం పార్టీ నేతలు లేబుల్లోనే పరిశీలించారు. నకిలీ మద్యంగా నిర్ధారించారు. టిడిపి నేతలు ఏ స్థాయిలో ఆరోపణలు చేసినా.. వ్యాపారానికి అలవాటు పడిపోయిన వైసీపీ నేతలు, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఇప్పటికైనా కేంద్రం దిగివస్తే మద్యం కుంభకోణం తో పాటు ఈ మద్యం మరణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతమైన సర్వే, పరిశీలన చేస్తే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.