Bigg Boss Telugu OTT: గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్ బాస్ ఓటీటీ ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. ఇప్పటికి మూడు వారాల ఎలిమినేషన్ దాటేసిన బిగ్ బాస్ సీజన్.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా టాస్క్ లు ఇస్తున్న బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ మధ్యలో అనుకున్నట్లుగానే చిచ్చు పెడుతున్నాడు. ఈసారి సీజన్ లో ప్రతీకార చర్యలు బాగానే కనిపిస్తున్నాయి. ఒకరినొకరు టార్గెట్ చేయడం బిగ్ బాస్ లో చాలా కామన్. కానీ ఈ సారి అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

ఎప్పటినుంచో యాంకర్ శివ మీద ఆగ్రహంగా ఉన్న నటరాజ్ మాస్టర్.. టైమ్ చూసి దెబ్బ కొట్టాడని తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తోంది. ఈ ప్రోమో ఈ వారంకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియలాగా కనిపిస్తోంది. ఈ సారి నామినేషన్స్ కి సరికొత్త విధంగా టాస్క్ కనిపెట్టాడు బిగ్ బాస్. హౌస్ లోకి ఒక లారీని తీసుకొచ్చిన బిగ్ బాస్.. హారన్ సౌండ్ చేసినప్పుడు ఎవరైతే లివింగ్ రూమ్ లోకి వెళ్లి మొదట హారన్ ను పట్టుకుంటే అతనే లారీ డ్రైవర్ గా సెలెక్ట్ అవుతాడు.
కాగా తాజాగా విడుదలైన ప్రోమో లో.. నటరాజ్ మాస్టర్ లారీ డ్రైవర్ అయినట్లు తెలుస్తోంది. ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా తన విరోధి అయిన యాంకర్ శివ, బిందు మాధవిలను ట్రాక్ లోకి తీసుకు వచ్చాడు. దీంతో ఇద్దరిలో ఎవరు నామినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా మారింది. అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం.. లారీ డ్రైవర్ సెలెక్ట్ చేసిన వారి మీద మిగతా ప్యాసింజర్స్ కూడా తమ ఓపెన్ కామెంట్స్ చేయాల్సి ఉంటుంది.
Also Read: BiggBoss OTT: కూల్ రాణి బిందుమాధవిని పడేయడం ఇంత కష్టమా? అలకరాజా అఖిల్ బిస్కట్లు..
అయితే అందరూ కలిసికట్టుగా యాంకర్ శివను టార్గెట్ చేశారు. ముఖ్యంగా బిందుమాధవి శివ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా చేసింది. అతను సెల్ఫిష్ అని, అతని కోసం తప్ప ఎవరి కోసం ఆలోచించడంటూ ఓపెన్ అయింది. వాస్తవానికి బిందుమాధవి మొదటినుంచి శివతో చాలా క్లోజ్ గా ఉంటుంది. కానీ నామినేషన్ వచ్చేసరికి మాత్రం ఇలా రివర్స్ అయిపోయింది.
ఇంక మిగతా కంటెస్టెంట్ అరియానా, తేజస్వి, మిత్రశర్మ, సరయు లాంటి వారు అందరూ కూడా శివని టార్గెట్ చేశారు. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది ఈ రోజు రాత్రి తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు యాంకర్ శివ, బిందుమాధవి మధ్య నటరాజ్ మాస్టర్ కావాలని చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఆయన ఈ విధంగా గొడవలు సృష్టించాడు. మరి నటరాజ్ మాస్టర్ అనుకున్నట్లుగానే శివ నామినేట్ అవుతాడా లేదా అన్నది మాత్రం ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.
Also Read: BiggBoss5 Telugu: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?
Recommended Video: