AP Politics: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే పొత్తులు ఎత్తులు అంటూ హీటు పెంచేస్తున్నాయి రాజకీయ పార్టీలు. గతంలో చంద్రబాబు వన్ సైడ్ లవ్ అంటూ జనసేన మీద తనకు ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మొన్న జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. జనసేన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చబోదని టీడీపీతో పొత్తుకు సంకేతాలు ఇచ్చేశారు.

దాంతో బీజీపీ ఏం చేస్తుందనే చర్చ మొదలైంది. బీజీపీ రూట్ మ్యాప్ ఏంటి అని గుసగుసలు కూడా వినిపించాయి. పవన్, చంద్రబాబు కోరుకున్నట్టుగా మూడు పార్టీల పొత్తు కుదురుతుందా అని అంతా అనుకున్నారు. కాగా ఈ ఊహాగానాలపై సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోబోమంటూ స్పష్టం చేశారు. తాము కేవలం జనసేనతోనే పొత్తు పెట్టుకున్నామని.. ఆ పార్టీతోనే ఎన్నికలకు వెళ్తాం అంటూ తేల్చి చెప్పేశారు.
Also Read: డబ్బుల కోసం ఇంతకు దిగజారుతారా.. జగన్ పై పవన్ ఫైర్
కాగా ఆయన కామెంట్లతో రాజకీయ రగడ రాజుకున్నట్లు అయింది. వాస్తవానికి పవన్ కు టీడీపీ కంటే బీజేపీతో ఉంటేనే ఎక్కువ లాభం అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన మంచి మైలేజ్ తో దూసుకెళుతోంది. ఇలాంటి సమయంలో బీజీపీతో పోటీ చేసి చెప్పుకోదగ్గ సీట్లు తెచ్చుకుంటే.. కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉంటుంది. పైగా కేంద్రంలో ఎలాగూ బీజేపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి.. రాష్ట్రంలో కూడా ఆ రెండు పార్టీల హయాంలో ప్రభుత్వం వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడు సోము వీర్రాజు తీసుకున్న స్టాండ్ కూడా బిజెపికి మేలు చేకూర్చేదే. టిడిపి ఇప్పట్లో కోలుకోలేదు కాబట్టి.. ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్న జనసేనతో కలిసి వెళ్లడం ఆ పార్టీకి మేలు చేకూరుస్తుంది. కాగా బిజెపి, జనసేన అధినేతతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం ప్రకటించిందా లేక సొంతంగానే చెప్పేసిందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. రాబోయే ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నామని చెబుతున్న సోము వీర్రాజు.. ఎలాంటి వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారో చూడాలి.
Also Read: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..
Recommended Video: