PM Modi Australia: ఒకప్పుడు మన దేశం నుంచి విదేశాలకు తరలి వెళ్లిన పురాతన వస్తువులు, దేవతామూర్తుల విగ్రహాలను బీజీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ వెనక్కు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాల నుంచి మన దేశం పురాతన వస్తువులను తెప్పించింది మోడీ సర్కార్. ఇందులో భాగంగా ఇప్పుడు ఆస్ట్రేలియాకు తరలివెళ్లిన కొన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దేవతామూర్తుల విగ్రహాలను తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం.

వీటిని స్వయంగా నరేంద్ర మోడీ దగ్గరుండి పరిశీలించారు. పురాతన కాలంలో మనదేశం నుండి తరలిపోయిన సుమారు 29 విగ్రహాలను దౌత్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మోడీ సర్కార్ తిరిగి రప్పించడంలో సక్సెస్ అయింది. ఇందులో ఎక్కువగా హిందువులకు సంబంధించిన విగ్రహాలు ఉండటం విశేషం. ముఖ్యంగా పరమశివుడు విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం, అమ్మవారు, జైనులకు సంబంధించినటువంటి కొన్ని అపురూపమైన విగ్రహాలను స్వదేశానికి తీసుకు వచ్చారు.
Also Read: కేసీఆర్ ముందరి కాళ్లకు ముందే బంధం వేసిన బీజేపీ
మోడీ ప్రభుత్వం గతంలో కూడా చాలా దేశాల నుంచి మన దేశ గౌరవ సూచికలైన వస్తువులను రప్పించింది. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరినప్పటి నుంచి ఇలా మన దేశం నుండి తరలిపోయిన ప్రతిష్టాత్మక విగ్రహాలను రప్పించడాన్ని చాలా కీలకంగా తీసుకుంటోంది. ఇప్పుడు ఈ విగ్రహాలను తీసుకురావడంలో మోడీ కీలకంగా వ్యవహరించారని సమాచారం.
ఇప్పుడు రప్పించిన విగ్రహాలు 9 లేదా పదో శతాబ్దంలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ లాంటి ప్రాంతాల నుంచి ఆస్ట్రేలియాకు తరలి పోయినట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. వీటిని ఆయా ప్రాంతాలకు తరలిస్తారా లేక కేంద్రం వద్ద ప్రతిష్టాత్మకంగా ఉంచుతారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read: డబ్బుల కోసం ఇంతకు దిగజారుతారా.. జగన్ పై పవన్ ఫైర్
Recommended Video:
[…] Also Read: PM Modi Australia: ఆస్ట్రేలియా నుంచి పురాతన విగ్… […]