Naresh Satirizes Shivaji: ప్రముఖ నటుడు శివాజీ(Actor Shivaji) హీరోయిన్స్ వేసుకునే దుస్తుల పై చేసిన కామెంట్స్, సుమారుగా నెల రోజుల పాటు చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ చూసినా దీని గురించే డిబేట్స్ నడిచేవి. అయితే రీసెంట్ గా ఈ వివాదం పై ఎవ్వరూ మాట్లాడకపోవడంతో, వివాదం చల్లారిందేలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సీనియర్ హీరో నరేష్ ఈ వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ చేసిన కొన్ని సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నరేష్ ముఖ్య పాత్ర పోషించిన ‘హే భగవాన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గానే జరిగింది. సుహాస్ హీరో గా నటించిన త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ శివాని నాగారంతో ఆయన ప్రవర్తించిన తీరు, చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
స్టేజి మీద ఉన్న హీరోయిన్ శివాని నాగారం ని కౌగలించుకోవడానికి దగ్గరగా వెళ్లిన నరేష్, ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తగ్గాడు. ఆమె చాలా పద్దతిగా చీర కట్టుకోవడాన్ని చూపిస్తూ ‘చూడండయ్యా..అందరూ శివాజీ చెప్పినట్టే వింటున్నట్టు ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రతీ ఈవెంట్ లోను అమ్మాయిలు ఏక్కువగా చీరలోనే కనిపిస్తున్నారు’ అంటూ సెటైరికల్ గా మాట్లాడాడు.అమ్మాయిలందరూ ఇలా ఇంత పద్దతిగా ఉంటే నాలాంటోళ్ళు హగ్ చేసుకోవడం కష్టం అయిపోతుందని యాంకర్ స్రవంతి ని ఒకరినొకరు కౌగలించుకోమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈవెంట్ లో సరదాగానే ఉన్నాయి కానీ, సోషల్ మీడియా లో మాత్రం, ఈ అంశం వివాదాలకు దారి తీస్తోంది. ముగిసిపోయిన వివాదాన్ని మళ్లీ బయటకు తీసి ఇలా ప్రవర్తించడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ఇకపోతే సుహాస్ హీరో గా నటించిన ఈ ‘హే భగవాన్’ అనే చిత్రం ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరోగా సుహాస్ ట్రాక్ రికార్డు ఇప్పటి వరకు బాగానే ఉంది. ఆయన కెరీర్ లో ఒకటి రెండు మినహా పెద్దగా ఫ్లాప్ సినిమాలు లేవు. అదే విధంగా ‘లిటిల్ హార్ట్స్’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శివాని నాగారం హీరోయిన్ గా చేస్తున్న చిత్రమిది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే సుహాస్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాని వేసుకున్నట్లు తెలుస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
