Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష 2' జడ్జీల విషయంలో సంచలన అప్డేట్.....

Bigg Boss Agnipariksha 2: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష 2’ జడ్జీల విషయంలో సంచలన అప్డేట్.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్..

Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్ 9’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే , ఈ సీజన్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం ఫ్యామిలీ ఎమోషన్స్ , బంధాల మధ్య ఈ షో నడవడం వల్లే. అంతే కాదు , ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మరో ముఖ్యమైన కారణం ‘అగ్నిపరీక్ష’ షో. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్ , మాస్క్ మ్యాన్ హరీష్ , దివ్య నిఖిత, ప్రియా, దమ్ము శ్రీజ వంటి వారు ఇచ్చిన కంటెంట్ మామూలుది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ వల్లే షో రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

అందుకే ఈ సీజన్ కి కూడా ‘అగ్ని పరీక్ష’ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు మేకర్స్. అయితే ఈ సీజన్ కి జడ్జీలుగా శివాజీ , గీత మాధురి వంటి వారు వ్యవహరిస్తారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. గత సీజన్ లో జడ్జీలుగా వ్యవహరించిన నవదీప్, బిందు మాధవి , అభిజీత్ లే ఈ సీజన్ కి కూడా జడ్జీలుగా వ్యవహరించబోతున్నారని సమాచారం. వచ్చే వారం ఈ ముగ్గురిపై స్పెషల్ ప్రోమో ని షూట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ నెల 27 నుండి ‘అగ్నిపరీక్ష 2’ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్టు 11 లేదా ఆగష్టు 13 నుండి ఈ షో జియో హాట్ స్టార్ , స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుందట. మొత్తం మీద ఈ షో 16 ఎపిసోడ్స్ ఉంటుందని సమాచారం.

అయితే గత సీజన్ లో సామాన్యులే టైటిల్ విన్నర్ గా నిలవడం తో , ఈ సీజన్ కి దరఖాస్తులు రికార్డు స్థాయిలో వస్తాయని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమి జరగలేదట. కేవలం 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయట. లక్షల్లో ఊహిస్తే వేలల్లో వచ్చాయి , ఈ విషయం లో మేకర్స్ కాస్త నిరాశలోనే ఉన్నారట. మరి ఈ షో కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. గత సీజన్ కంటే , ఈ సీజన్ లో చాలా కఠినమైన టాస్కులు నిర్వహించబోతున్నారని, ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ తరుపున మెంటర్స్ కూడా ఉంటారని , గత సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిల్చిన కళ్యాణ్ పడాల కూడా ఒక మెంటర్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....
Oktelugu Epaper
Exit mobile version