Nani: ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా మారిన నటుడు నాని…ఆయన ఆ తర్వాత నాచురల్ స్టార్ గా మారిపోయాడు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి దగ్గరవ్వడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకొని పాన్ ఇండియాలో ఇతర హీరోలతో పాటు పోటీ పడే స్థాయికి తను ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో వీళ్ళ కాంబినేషన్ కి భారీ క్రేజీ ఏర్పడటమే కాకుండా ప్యారడైజ్ గ్లింప్స్ కి సైతం గొప్ప పేరైతే వచ్చింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది దర్శకులతో ఆయన సినిమాలను సెట్ చేసుకుంటే పాన్ ఇండియాలో కూడా ఆయన మరింత ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే నాని ప్రాజెక్ట్స్ మీద సరైన క్లారిటి అయితే ఇవ్వలేకపోతున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘బ్లడీ రొమియో’ సినిమా ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య ని హీరోగా పెట్టి ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ అనే సినిమా చేశాడు.
ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయగలిగితే మాత్రం నాని సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది… ఇక తనతోపాటుగా బ్లాస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన సుభాష్ కే రాజు డైరెక్షన్ లో కూడా నాని ఒక సినిమా చేయబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక తొందరలోనే వీళ్ళ సినిమాకి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి…
