Homeఎంటర్టైన్మెంట్Nani: నాని టెన్షన్.. ఏం మాట్లాడినా తీవ్ర ఇబ్బందే !

Nani: నాని టెన్షన్.. ఏం మాట్లాడినా తీవ్ర ఇబ్బందే !

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బాగా టెన్షన్ లో ఉన్నాడు. కారణం.. పదిహేను రోజుల క్రితం ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో థియేటర్స్ గురించి, సినిమా ఎక్కడ చూడాలి అనే దాని గురించి తెగ సూక్తులు చెప్పాడు. థియేటర్ లో సినిమాలు చూడడం అనేది మన కల్చర్ అంటూ నాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎలాగైనా మనం అంతా కలిసి థియేటర్ల వ్యవస్థను బతికించుకోవాలని పెద్ద మనిషిలా భారీ మెసేజ్ లు ఇచ్చాడు. కానీ, […]

Natural Star Nani

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బాగా టెన్షన్ లో ఉన్నాడు. కారణం.. పదిహేను రోజుల క్రితం ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో థియేటర్స్ గురించి, సినిమా ఎక్కడ చూడాలి అనే దాని గురించి తెగ సూక్తులు చెప్పాడు. థియేటర్ లో సినిమాలు చూడడం అనేది మన కల్చర్ అంటూ నాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎలాగైనా మనం అంతా కలిసి థియేటర్ల వ్యవస్థను బతికించుకోవాలని పెద్ద మనిషిలా భారీ మెసేజ్ లు ఇచ్చాడు.

కానీ, కట్ చేస్తే.. సరిగ్గా 15 రోజులు తిరిగేసరికి నాని నటించిన ‘టక్ జగదీష్’ థియేటర్లో విడుదల కాబోవడం లేదు అని క్లారిటీ వచ్చేసింది. అదేంటి ? నాని థియేటర్స్ గురించి ఓ రేంజ్ లో చెప్పాడు కదా ? ఇప్పుడు తన సినిమానే ఓటీటీ లో ఎలా రిలీజ్ చేస్తున్నాడు ? అంటూ థియేటర్ సంఘం వారు బిక్కమొహం పెట్టారు. ఇటు నెటిజన్లు కూడా ఇదే పాయింట్ పట్టుకున్నారు.

‘టక్ జగదీష్’ సినిమా గురించి నాని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాడా ? ఎప్పుడు ట్రోల్ చేద్దామా ? అని ఆశగా ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. మరోపక్క జనం కూడా నాని తొందరపడి అనవసరంగా లెక్చర్లు దంచి కొట్టాడు అని, ఇప్పుడు మాట నిలబెట్టుకోలేక పోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కరోనా కారణంగానే తన చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తోంది అని చెప్పుకునే అవకాశం నానికి లేదు.

ఎందుకంటే, గతేడాది “వి” సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసిన సమయంలో కూడా.. తన తర్వాత సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేస్తాను అని ప్రేక్షకులకు ప్రామిస్ చేశాడు. దీనికితోడు పబ్లిక్ స్టేజ్ పైన థియేటర్లలోనే సినిమాలు రిలీజ్ చెయ్యాలి అని మిగిలిన హీరోలకు కూడా హితబోధ చేసే ప్రయత్నం చేశాడు.

ఇప్పుడు ఆ మాటలే నానిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఇప్పుడు టక్ జగదీష్ విషయాన్ని ఎలా చెప్పాలి అనే టెన్షన్ లో ఉన్నాడు నాని.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper