spot_img
Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna: 1000 కోట్ల రూపాయిల జాబితాలో నందమూరి బాలకృష్ణ..స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ...

Nandamuri Balakrishna: 1000 కోట్ల రూపాయిల జాబితాలో నందమూరి బాలకృష్ణ..స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ సెన్సేషనల్ రికార్డు!

Nandamuri Balakrishna: ప్రస్తుతం సీనియర్ హీరోలలో గోల్డెన్ ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన హీరో గా నటించిన ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు ఘనవిజయాలు సాధించడం, ఆ తర్వాత ఆహా మీడియా లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో యూత్ ఆడియన్స్ కి మరింత చేరువ అవ్వడం, ఇలా ఎటు చూసిన బాలయ్య కి అన్నీ శుభ శకునములే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన అనిల్ రావిపూడి తో ‘భగవత్ కేసరి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో గత కొంత కాలం నుండి జరుగుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు బోయపాటి శ్రీను తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అఖండ 2 లేదా సరికొత్త కథ తో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగేది. అయితే ఇప్పుడు బాలయ్య ఆ ప్రాజెక్ట్ ని తాత్కాలికంగా పక్కన పెట్టి, ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై ద్రుష్టి సారించాడని తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య , తన డ్రీం ప్రాజెక్ట్ చెంగిస్ ఖాన్ బయోపిక్ చెయ్యాలని ఉందని, రిటైర్ అయ్యేలోపు ఆ సినిమా కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు.

బాలయ్య మాటలను పరిగణలోకి తీసుకున్న ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చెంగిస్ ఖాన్ బయోపిక్ మీద స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని బాలయ్య వద్దకి తీసుకొచ్చి ఇటీవలే వినిపించాడట. స్క్రిప్ట్ ని విన్న బాలయ్య శబాష్ అని పొగిడి తదుపరి ప్రాజెక్ట్ ఇదేనని మాట ఇచ్చాడట. ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని పెట్టబోతున్నాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
Oktelugu Epaper