https://oktelugu.com/

‘అక్కినేని నాగార్జున’ను వెంటాడుతోన్న బాధ !

అక్కినేని నాగార్జునకు గత మూడు ఏళ్లుగా మనసులో ఓ బాధ విపరీతంగా వెంటాడుతుందట. ఏ తండ్రికైనా పుత్రోత్సాహం కదే.. నిజమైన ఆనందాన్ని ఇచ్చేది. కానీ, నాగ్ కు ఆ పుత్రోత్సాహం విషయంలోనే రోజురోజుకూ అసంతృప్తి ఎక్కువైపోతుందట. విజయ్ దేవరకొండ, నాని లాంటి అడ్రెస్ లేని హీరోలూ స్టార్లు అయిపోతున్నారు, చరణ్, బన్నీ, తారక్, ప్రభాస్, మహేష్ లాంటి వారసులూ స్టార్లు అయిపోతున్నారు. కానీ తన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చైతు, అఖిల్ ఇద్దరూ మిడియమ్ రేంజ్ మార్కెట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2020 / 09:16 PM IST
    Follow us on

    అక్కినేని నాగార్జునకు గత మూడు ఏళ్లుగా మనసులో ఓ బాధ విపరీతంగా వెంటాడుతుందట. ఏ తండ్రికైనా పుత్రోత్సాహం కదే.. నిజమైన ఆనందాన్ని ఇచ్చేది. కానీ, నాగ్ కు ఆ పుత్రోత్సాహం విషయంలోనే రోజురోజుకూ అసంతృప్తి ఎక్కువైపోతుందట. విజయ్ దేవరకొండ, నాని లాంటి అడ్రెస్ లేని హీరోలూ స్టార్లు అయిపోతున్నారు, చరణ్, బన్నీ, తారక్, ప్రభాస్, మహేష్ లాంటి వారసులూ స్టార్లు అయిపోతున్నారు. కానీ తన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చైతు, అఖిల్ ఇద్దరూ మిడియమ్ రేంజ్ మార్కెట్ తెచ్చుకోవడానికే ఇంకా నానాపాట్లు పడాల్సి వస్తోంది.

    Also Read: రజినీకాంత్ తో కమల్ హాసన్.. సంచలనం

    కొంతలో కొంత చైతు ఏవరేజ్ హీరోగా బండిని లాక్కోస్తుంటే.. అఖిల్ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉందట. నిజానికి అఖిల్ హీరో కాకముందే సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ‘మనం’ సినిమాలో అఖిల్ చేసిన గెస్ట్ రోల్ బాగా వర్కౌట్ అవ్వడంతో.. విపరీతమైన హైప్ ను సంపాధించాడు అఖిల్. ఆ హైపే అఖిల్ కొంప ముంచింది. అఖిల్ నుండి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడంతో అఖిల్ చేతులెత్తేయాల్సి వస్తోంది. హీరో అయ్యాక సూపర్ స్టార్ మాట పక్కన పెడితే.. స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడాల్సి వస్తోంది.

    Also Read: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సరికొత్త రికార్డ్ !

    కాగా అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ప్లాప్ అయితే ఇక అఖిల్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కూడా ఉండదు. ఇదే భయం పట్టుకుంది నాగార్జునకు. అందుకే నాగార్జున సైతం ఈ సినిమా పై ముందు నుంచీ విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని పనులను దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నాడట. దీనికితోడు లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో నాగార్జున, అఖిల్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. మరి ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే.. ఇక అఖిల్ కెరీర్ కష్టమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్