
ఒకరేమో దక్షిణాది సూపర్ స్టార్.. స్టైల్ కే స్టైల్ నేర్పాడు.. ఇంకొకరేమో ‘లోక నాయకుడు’ విలక్షణ నటుడు కమల్ హాసన్. ఈ ఇద్దరు కలిస్తే ఇంకా ఏమైనా ఉందా..? బాక్స్ బద్దలే.. రికార్డులు చెదిరిపోతాయి.
Also Read: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సరికొత్త రికార్డ్ !
అయితే తమిళనాడు ఎన్నికల వేళ ఈ ఇద్దరు చెరో పార్టీతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే రాజకీయ బరిలోకి దూకిన కమల్ రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. త్వరలోనే తామిద్దరం కలిసి ఓ చిత్రంలో నటిస్తామని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలకు ముందు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నానన్నారు.
Also Read: ట్విట్టర్ హీరోలు వీరే!
2021 మే నెలలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. తాను సైతం ఏదో ఒక స్థానం నుంచి పోటీచేస్తానని.. మీడియాకు త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు పొలిటికల్ థ్రిల్లర్ తీసి అందులో సీఎంగా చూపించుకొని ప్రజల్లో హైప్ సృష్టించాలని కమల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.