https://oktelugu.com/

నిహారిక పెళ్లికి అందుకే దూరంగా ఉన్నా.. పవన్ పై క్లారిటీ: రేణు దేశాయ్

మెగా కుటుంబంలో ఇటీవల జరిగిన నిహారిక పెళ్లి ఎంతో సంతోషాన్ని నింపింది. కొణిదెల, అల్లు వారి కుటుంబాలు మొత్తం కలిసి సందడి చేశాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, ఆయన పిల్లలు అకీరా నందన్ , ఆద్య కూడా హాజరయ్యారు. అయితే వీరి తల్లి అయిన రేణు దేశాయ్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేదు. అటు పవన్ ప్రస్తుత భార్య అన్నా లెజినోవా కూడా రాలేదు. ఈ క్రమంలోనే రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. […]

Written By: , Updated On : December 14, 2020 / 09:18 PM IST
Follow us on

Renu Desai

మెగా కుటుంబంలో ఇటీవల జరిగిన నిహారిక పెళ్లి ఎంతో సంతోషాన్ని నింపింది. కొణిదెల, అల్లు వారి కుటుంబాలు మొత్తం కలిసి సందడి చేశాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, ఆయన పిల్లలు అకీరా నందన్ , ఆద్య కూడా హాజరయ్యారు. అయితే వీరి తల్లి అయిన రేణు దేశాయ్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేదు. అటు పవన్ ప్రస్తుత భార్య అన్నా లెజినోవా కూడా రాలేదు. ఈ క్రమంలోనే రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి.

Also Read: ‘అక్కినేని నాగార్జున’ను వెంటాడుతోన్న బాధ !

నిహారిక పెళ్లికి తాను ఎందుకు రాలేదనే దానిపై రేణుదేశాయ్ స్వయంగా వెల్లడించారు. రేణు దేశాయ్ ని ఆహ్వానించలేదని.. పవన్ ను చూడడం కలవడం ఇష్టం లేకనే రేణు రాలేదనే రూమర్లు వచ్చాయి. వీటిని తాజాగా రేణు కొట్టిపడేశారు.

తనకు నిహారిక పెళ్లి ఆహ్వానం అందిందని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9వ తేదీన తనకు ముందే నిర్ణయించుకున్న షూటింగ్ ఉందని.. అందుకే నా పిల్లలను పెళ్లికి పంపి నేను రాలేకపోయానని రేణు క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపింది.

Also Read: రజినీకాంత్ తో కమల్ హాసన్.. సంచలనం

ఇక రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీతో కలిసిపోయారు. నాన్న పవన్ తో కలిసి ఎక్కువ సమయాన్ని గడిపారు. జాలీగా పవన్ తో ఎంజాయ్ చేశారు. పవన్ ఈ పెళ్లిలో ఒకరోజు మాత్రమే ఉండే వెంటనే హైదరాబాద్ వచ్చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్