Nagarjuna Sensational Comments: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నెమ్మదిగా హీరో రోల్స్ కి దూరమై క్యారక్టర్ రోల్స్ చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కీలక పాత్ర పోషించిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే విధంగా కెరీర్ లో మొట్టమొదటిసారి విలన్ క్యారక్టర్ చేసిన ‘కూలీ’ చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జున సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తాను గతం లో చేసిన బ్రహ్మాస్త్ర చిత్రం గురించి, రాబోయే రోజుల్లో చేయబోయే సినిమాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం.
నాగార్జున మాట్లాడుతూ ‘ బ్రహ్మాస్త్ర సినిమాలో పని చేయడం నాకు ఎంతో సంతృప్తి ని ఇచ్చింది. అయాన్ నాకు నా పాత్ర గురించి న్యారేట్ చేసినప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి. తెరమీద నా క్యారక్టర్ ని చూసుకున్నప్పుడు నూటికి నూరు శాతం సంతృప్తి కలిగింది. సినిమాలో అందరికంటే నా క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా వచ్చింది. షారుఖ్ ఖాన్ క్యారక్టర్ కూడా నా క్యారక్టర్ ముందు డామినేట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. నాగార్జున చెప్పింది కూడా నిజమే, బ్రహ్మాస్త్ర చిత్రం లో ఆయనకు చాలా పవర్ ఫుల్ క్యారక్టర్ దొరికింది. అప్పట్లో షారుఖ్ ఖాన్ క్యారక్టర్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి ఇంతటి బలహీనమైన క్యారక్టర్ చేయడానికి షారుఖ్ ఖాన్ ఎలా ఒప్పుకున్నాడు అంటూ ఆయన అభిమానులు సైతం నిరాశకు గురి అయ్యారు. ఆయన పాత్ర కంటే నాగార్జున పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా అనిపించింది అంటూ నెటిజెన్స్ అప్పట్లో కామెంట్స్ చేశారు.
నాగార్జున భవిష్యత్తులో చేయబోయే క్యారెక్టర్స్ కూడా ఈ రేంజ్ లో ఉంటే అభిమానుల నుండి ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా వేరేలా ఉంటే మాత్రం ఆయన అభిమానులు కూడా ఆయన్ని పూర్తిగా వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కినేని అభిమానులు అనేక మంది సోషల్ మీడియా ని వదిలి వెళ్లిపోయారు. ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ‘కూలీ’ చిత్రం నిర్ణయించబోతుంది. అందుకు కోసం ఆగష్టు 14 వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే నాగార్జున 100 వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. యాక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో హీరో గా ఆయన మరోసారి తన సత్తా చూపిస్తాడని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. నాగార్జున తో సమానమైన ఇమేజ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ మరియు వెంకటేష్ వంటి వారు వరుసగా హిట్స్ కొడుతూ మంచి ఊపు మీదున్నారు. నాగార్జున కూడా సోలో హీరో గా అలా హిట్ కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.